సమంత: 2014 లో ఎనిమిది రిలీజ్ లు...లిస్ట్(ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : 'మనం'తో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆమె ఇటీవల 'ఆటోనగర్‌ సూర్య'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'రభస'లో నటిస్తోంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'అల్లుడు శీను' చేసింది. తమిళంలో సూర్య, విజయ్‌, విక్రమ్‌లాంటి అగ్ర హీరోల సరసన ఆడిపాడుతోంది. మొత్తం సమంత నటించిన ఏడ చిత్రాలు ఈ సంవత్సరం విడుదల అవుతున్నాయి.

''ఈ ఏడాది చాలా కష్టపడుతున్నా. అందుకే నా సినిమాలు ఏడు విడుదలవుతాయి''అని చెబుతోంది సమంత. ''ఒక హీరోయిన్ గా ఈ స్థాయికి చేరుకోవడం వెనక కారణం ఏంటని ఎవరైనా అడిగితే 'నేనే నేనే...' అని చెప్పాలనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. నా అదృష్టమే నన్నీ స్థాయికి చేర్చిందని నమ్ముతాను. మంచి కథలు నా దగ్గరికి మాత్రమే వస్తున్నాయంటే అర్థం అదే కదా'' అంటోంది సమంత.

ఇక ''ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాను కాబట్టి చిన్న చిన్న పాత్రల్లో కనిపించడమే మేలనుకొంటున్నా. ఎందుకంటే ప్రేక్షకులు 'మళ్లీ సమంతనే చూడాలా?' అని మొహం మొత్తేసినట్టుగా భావించకూడదు. 'ఆటోనగర్‌ సూర్య'లో నన్ను చూశాక సమంత మరికాసేపు తెరపై కనిపించుంటే బాగుండేది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయం నాకు సంతృప్తినిచ్చింది. తక్కువ మేకప్‌తో ఒక సాదాసీదా అమ్మాయి పాత్ర పోషించాను. ఆ సినిమా సాధించిన ఫలితం కంటే... అది విడుదలవ్వడమే గొప్ప విజయం అనిపిస్తోంది'' అని వివరించింది.

ఇంతకీ ఆ ఏడు సినిమాలు ఏమేమిటి..అనేది స్లైడ్ షో లో చూడండి...

అల్లుడు శ్రీను

అల్లుడు శ్రీను

వివి వినాయిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం జూలై 24న విడుదల అవుతోంది.

రభస

రభస

ఎన్టీఆర్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రభస. పూర్తి యాక్షన్ కామిడీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14 న విడుదల అవుతోంది.

సికిందర్

సికిందర్

తమిళంలో అంజాన్ టైటిల్ లో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో సికిందర్ గా రానుంది. సూర్య సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఆగస్టు 15 న ఈ చిత్రం విడుదల అవుతోంది.

కత్తి

కత్తి

విజయ్ సరసన మురగదాస్ దర్శకత్వంలో సమంత చేస్తున్న చేస్తున్న చిత్రం కత్తి. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే సంచలనం రేపింది. ఈ చిత్రం కూడా ఈ సంవత్సరమే నవంబర్ నెలలో విడుదల కానుంది.

విక్రమ్ తో...

విక్రమ్ తో...

విక్రమ్ హీరోగా ... దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ Idam Maari Irangiyavan టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. దీనికి సంబంధించిన విశేషమేమంటే అగ్ర దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాని నిర్మిస్తుండటం. ఈ చిత్రం సైతం ఇదే సంవత్సరం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

మళయాళ చిత్రం

మళయాళ చిత్రం

ఈ సంవత్సరం సమంత నటించిన Marine Drive అనే మళయాళ చిత్రం సైతం విడుదల కానుంది. డిసెంబర్ 19న ఈ చిత్రం విడుదల ప్లాన్ చేసారు.

ఆటోనగర్ సూర్య

ఆటోనగర్ సూర్య

ఇక కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం విడుదల అయ్యింది. నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని దేవకట్టా డైరక్ట్ చేసారు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది.

మనం

మనం

అలాగే ఇదే సంవత్సరంలో సమంత నటించిన మనం చిత్రం సైతం రిలీజైంది. అక్కినేని కుటుంబ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సమంతకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద లాభాలు తెచ్చిపెట్టింది.

బెంగుళూరు డేస్

బెంగుళూరు డేస్

అలాగే సమంత మరో మల్టీ స్టారర్ చిత్రం ఒప్పుకుంది. దిల్ రాజు, పివిపి వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో సమంతను తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల అవుతుంది.

రెమ్యునేషన్ గురించి...

రెమ్యునేషన్ గురించి...

ఇటీవల నేను ఓ సినిమా కోసం రూ.రెండు కోట్లు తీసుకొన్నానని చర్చ జరుగుతోంది. అంత ఇచ్చుంటే బాగానే ఉండేది (నవ్వుతూ). కానీ అది నిజం కాదు. అన్ని సినిమాలకు ఒకలాగే పారితోషికం తీసుకుంటా అంటోంది సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X