సూపర్ డీలక్స్ వసూళ్ల అలజడి.. పేట్టా, విశ్వాసం మించి రికార్డు కలెక్షన్లు..
విలక్షణ తారలు విజయ్ సేతుపది, ఫహాద్ పాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ తదితరులు నటించిన సూపర్ డీలక్స్ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల అలజడి రేపుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రిలీజైన తొలి ఆట నుంచే కాసుల పంట పండిస్తున్నది. తొలి రోజు కలెక్షన్ల ఎలా ఉన్నాయంటే...

చెన్నైలో భారీ కలెక్షన్లు
కామెడీ ప్రధానంగా భావోద్వేగ కథతో రూపొందిన సూపర్ డీలక్స్ చిత్రం చెన్నైలో భారీ కలెక్షన్లను రాబట్టింది. నయనతార నటించిన ఐరా చిత్రానికి మించి ఈ సినిమా వసూళ్లను రాబట్టడం సినీ వర్గాలను ఆశ్చర్య పరుస్తుంది. చెన్నైలోనే తొలి రోజు రూ.43 లక్షలు వసూలు చేయడం విశేషంగా మారింది.

యూఎస్‌లో లక్ష డాలర్లు
యూఎస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డీలక్స్ సందడి చేస్తున్నది. ఈ చిత్రం తొలిరోజునే 1 లక్ష డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతంలో పేట్టా, విశ్వాసం చిత్రాల తర్వాత ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

సమంత అక్కినేని కెరీర్‌లోనే
దర్శకుడు మిస్కిన్, నలన్ కుమారస్వామి, నీలన్ కే శేఖర్, త్యాగరాజన్ కుమారరాజా కలిసి సూపర్ డీలక్స్ కథను అందించారు. ట్రాన్స్ జెండర్ శిల్పగా విజయ్ సేతుపతి, పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ, వెంబు అనే పాత్రలో సమంత అక్కినేని నటన హైలెట్ అని సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. సమంత కెరీర్‌లోనే అత్యుత్తమ నటన అని పేర్కొంటున్నారు.

సూపర్ డీలక్స్‌లో ట్రాన్స్ జెండర్‌గా విజయ్ సేతుపతి
సూపర్ డీలక్స్ సినిమా ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ చిత్ర అనుభవాలను దర్శకుడు కుమారరాజా మీడియాతో పంచుకొన్నారు. నా స్నేహితుడి సినిమాకు నిర్మాతగా మారుదామని అనుకొంటూ.. కథ వినమని విజయ్ సేతుపతిని అడిగాను. అయితే మీరు ఏం చేస్తున్నారంటే సూపర్ డీలక్స్ అనే కథపై పనిచేస్తున్నాను. మీరు ట్రాన్స్ జెండర్‌గా నటిస్తానంటే కథ చెబుతాను అని అన్నాను. దాంతో ఆయన రెండు రోజుల సమయం కావాలని అడిగి.. ఆ తర్వాత వెంటనే సినిమా చేయడానికి ముందుకొచ్చారు. అలా ఈ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి భాగమయ్యారు.


Click it and Unblock the Notifications











