Samantha Ruth Prabhu: యశోద సినిమా అసలు బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. బిగ్ మూవీగా..
సమంత రూత్ ప్రభు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఇంతకుముందు మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక ఇప్పుడు ఆమె యశోద అనే ఒక డిఫరెంట్ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
హరి - హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయక ఆదిత్య 369 వంటి సినిమాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ పై చాలా నమ్మకంతో ఉన్నట్లు కూడా ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అదేవిధంగా సినిమాపై పెట్టిన బడ్జెట్ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మొదట ఈ సినిమాను కేవలం మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ కంటెంట్ తగ్గట్టుగా సినిమాను తెరపైకి తీసుకురావాలి అంటే ఇంకా ఎక్కువ అవుతుంది అని ఆ తర్వాత మళ్లీ స్క్రిప్టులో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది అని చెప్పారు. మొత్తంగా ఈ సినిమాకు 30 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు అయినట్లు కూడా ఆయన వివరణ ఇచ్చారు.
ఒక విధంగా సమంత కెరీర్లో ఇదే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన లేడియేటెడ్ సినిమా అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుంది అని కూడా నిర్మాత తెలియజేశారు. సరోగసి బ్యాక్ డ్రాప్ లో ఇంతవరకు ఎవరు చూపించని ఒక సరికొత్త పాయింట్ ను ఈ సినిమాలో చూపించబోతున్నాము అని ఇదొక వరల్డ్ సినిమా అని కూడా కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో మలయాళ ప్రముఖ నటుడు అన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. మరి నవంబర్ 11వ తేదీన వస్తున్న యశోద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











