Shaakuntalam Closing Collections దిల్ రాజు కెరీర్‌లో బిగ్గెస్ట్ లాస్.. శాకుంతలం మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా భారీ అంచనాలతో ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుశ్యంతుడు, శాకుంతల పౌరాణిక ప్రేమ గాధను ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. దిల్ రాజు, నీలిమా గుణా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అయితే విడుదలైన తర్వాత దారుణమైన టాక్‌ను సొంతం చేసుకొన్నది. శాకుంతలం సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
శాకుంతలం బడ్జెట్, స్క్రీన్ కౌంట్
శాకుంతలం సినిమాను భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ అవసరం కావడంతో బడ్జెట్ కూడా పెరిగింది. దానికి తోడు 3డీ ఫార్మాట్‌కు కన్వర్ట్ చేయడంతో బడ్జెట్ తడిసి మోపెడు అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారు 60 కోట్లుగా పేర్కొన్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

శాకుంతలం బిజినెస్ వ్యాల్యూ
శాకుంతలం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 25 కోట్లుగా అంచనా వేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 26 కోట్లు షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి వచ్చింది. దిల్ రాజు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది.

తొలి రోజు భారీగా
శాకుంతలం సినిమా అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు భారీ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు తెలుగులో 2.33 కోట్ల గ్రాస్, హిందీలో 2 కోట్ల గ్రాస్, తమిళంలో 15 లక్షల గ్రాస్, మలయాళంలో 2 లక్షల కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు మొత్తంగా 2.7 కోట్ల వసూళ్లను వసూలు చేసింది. అదే ఊపును ఈ సినిమా ఆ తర్వాత రోజుల్లో కొనసాగించలేకపోయింది.

శాకుంతలం ఎంత వసూలు చేసిందంటే?
శాకుంతలం సినిమా టోటల్ థియేట్రికల్ రన్‌లో పేలవంగా కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగులో 5.7 కోట్ల రూపాయలు, హిందీలో 1.22 కోట్ల రూపాయాలు, తమిళంలో 31 లక్షలు, మలయాళంలో 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఇండియాలో ఈ సినిమా 7.27 కోట్ల రూపాయలు, 98 లక్షలు ఓవర్సీస్‌లో కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 4.5 కోట్ల షేర్, 8 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

శాకుంతలం మూవీకి ఎంత నష్టమంటే?
శాకుంతలం సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 25 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా సుమారు 5 కోట్లు మాత్రమే కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారు 20 కోట్ల వరకు నష్టాలను నమోదు చేసింది. ఒక మీడియం రేంజ్ సినిమా ఈ రేంజ్‌లో నష్టపోవడం ఇటీవల కాలంలో ఇదే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











