Yashoda Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లు.. మరో 66 లక్షలు వస్తే రికార్డే!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్లు సందడి చేస్తున్నారు. కానీ, అందులో ఒకరిద్దరు మాత్రమే వరుస చిత్రాలతో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో స్టార్ హీరో సమంత రూత్ ప్రభు ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'యశోద' అనే సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా 8 రోజుల్లో ఎంత రాబట్టింది? ఇంకెంత వసూలు చేయాలో చూడండి!

యశోదగా మారిపోయిన సమంత
తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'యశోద'. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. దీన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు.

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే
సమంత నటించిన 'యశోద' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో ఈ మూవీకి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.30 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 11.50 కోట్ల బిజినెస్ అయింది.

8వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?
సమంత 'యశోద' మూవీకి 8 రోజు వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 31 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వసూలైంది.

వారం రోజుల్లో ఎంత వచ్చింది?
8 రోజుల్లో సమంత 'యశోద' మూవీకి వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి రూ. 6.84 కోట్లు షేర్, రూ. 12.05 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 6.84 కోట్లు వసూలు చేసిన 'యశోద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.45 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.34 కోట్లు షేర్, రూ. 24.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి
క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'యశోద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.34 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 66 లక్షలు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

రెండు రికార్డులకు చేరువైందిగా
సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోయేలా వచ్చాయి. ఇలా ఇప్పటికే ఇది మంచి వసూళ్లను రాబట్టి హిట్ ముంగిట నిలిచింది. ఇక, ఈ చిత్రానికి మరో రూ. 75 లక్షలు గ్రాస్ వస్తే.. 25 కోట్ల మైలురాయిని చేరుతుంది. అలాగే, రూ. 66 లక్షలు షేర్ వస్తే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











