Yashoda Movie day 2 Collections worldwide: రెండో రోజే లాభాల్లోకి యశోద.. యూఎస్‌లో సమంత మూవీ రికార్డు!

లేడీ సూపర్‌స్టార్ సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రెండో రోజు నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్య శ్రీపాద, కల్పిక గణేష్, ప్రియాంక శర్మ, మురళీ శర్మ, శత్రు, రావు రమేష్, సంపత్ రాజ్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ నోట్‌తో దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడుతున్నది. రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తొలి రోజు యశోద కలెక్షన్లు

తొలి రోజు యశోద కలెక్షన్లు

యశోద చిత్రం తొలి రోజు సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా యశోద చిత్రం 3 కోట్లకుపైగా షేర్, 6 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజున తెలుగులో 2.7 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 25 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది.

రెండో రోజు పరిస్థితి ఎలా ఉందంటే?

రెండో రోజు పరిస్థితి ఎలా ఉందంటే?

ఇక రెండో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించింది. మార్నింగ్ షోలు కాస్త యావరేజ్‌గానే స్టార్ట్ అయినప్పటికీ.. ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఓవరాల్‌గా 60 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది.

దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ

దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ

దేశవ్యాప్తంగా యశోద ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ 50 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 90 శాతం, విజయవాడ, వరంగల్, గుంటూరు, వైజాగ్, నిజమాబాద్‌లో 40 శాతం వరకు, ఢిల్లీలో 30 శాతం, కాకినాడలో 99 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మిగితా ప్రధాన ప్రాంతాల్లో 35 శాతం నుంచి 55 శాతం వరకు ఆక్యుపెన్సీ రికార్డు అయింది.

అమెరికాలో రెండో రోజు లాభాల్లోకి..

అమెరికాలో రెండో రోజు లాభాల్లోకి..


యశోద చిత్రం అమెరికాలో భారీ వసూళ్లను రాబడుతున్నది. అమెరికాలో గత రెండు నెలల్లో లాభాలను సాధించిన రెండో చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించింది. కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ల రూపంలో 65k, తొలి రోజు 135k వసూళ్లను సాధించింది. రెండో రోజు ముగిసే సరికి.. 350k డాలర్లు అంటే 2.8 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో

యశోద చిత్రం దేశవ్యాప్తంగా సుమారు 4.13 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులో 3.6 కోట్లు, హిందీలో 14 లక్షలు, తమిళంలో 39 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు కంటే రెండో రోజు బాక్సాఫీస్ వద్ద 35 శాతం వృద్ధిని సాధించింది. మూడో రోజు కూడా భారీగానే వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ఇక యశోద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. శ్రీదేవీ మూవీస్ ఈ సినిమాను సొంతంగా అన్ని భాషల్లో రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్‌ను 14 కోట్లుగా వ్యాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా యశోద గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 7.19 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకుపైగా షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X