Shaakuntalam Collections: రెండవ రోజు భారీగా తగ్గిన కలెక్షన్స్.. రావాల్సింది ఇంకా చాలా ఉంది!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన చిత్రం శాకుంతలం. మైథాలజికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా మొదటి రోజే ఊహించని స్థాయిలో తక్కువ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇక రెండవ రోజు కూడా సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమి పెరగలేదు. ఇక ఏరియా వారిగా మొత్తంగా రెండవ రోజు శాకుంతలం సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఇంకా లాభాల్లోకి రావాలి అంటే ఏ స్థాయిలో షేర్ రాబట్టాల్సి ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రీ రిలీజ్ బిజినెస్: సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు ముందు అయితే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి సంయుక్తంగానే నిర్మించారు. ఇక ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా మార్కెట్లో మంచి బిజినెస్ అయితే చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. దీంతో 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫైనల్ అయింది.
2వ రోజు నైజాం, ఏపీ కలెక్షన్స్: శాకుంతలం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 1.08 కోట్లు షేర్ అందుకుంది. ఇక రెండవ రోజు ఏరియా లవారీగా చూసుకుంటే.. నైజంలో 21 లక్షలు, సీడెడ్ లో 6 లక్షలు, ఉత్తరాంధ్రలో 8 లక్షలు, ఈస్ట్ లో 4 లక్షలు, వెస్ట్ లో 3 లక్షలు, గుంటూరులో 3 లక్షలు, కృష్ణాలో 4 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండవ రోజు 51 లక్షల షేర్ కలెక్షన్స్ కోటి గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

2 రోజుల టోటల్ కలెక్షన్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శాకుంతలం సినిమా కలెక్షన్స్ మొదటి రోజు కంటే రెండవ రోజు సగానికి పైగా పడిపోయాయి. ఇక మొత్తంగా ఈ సినిమా ఏరియాల వారిగా రెండు రోజుల్లో ఎంత కలెక్షన్స్ చేశాయి అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 73 లక్షలు, సీడెడ్ లో 16 లక్షలు, ఉత్తరాంధ్రలో 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు, వెస్టులో 7 లక్షలు, గుంటూరులో 11 లక్షలు, కృష్ణ లో 12 లక్షలు, నెల్లూరులో 5 లక్షలు, ఏపీ తెలంగాణలో రెండు రోజుల్లో శాకుంతలం సినిమా 1.59 కోట్లు షేర్, 3.15 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్: ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు శుక్రవారం శనివారం రోజు 1.59 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా తమిళనాడులో కేవలం 26 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటు నుంచి 25 లక్షల షేర్ వచ్చింది, ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా 85 లక్షలు మాత్రమే దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం సినిమాకు 2.95 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

నష్టాలు రాకుండా ఉండాలంటే.. ఎంత రావాలి?: శాకుంతలం సినిమా ఊహించిన దానికంటే మొదటి రెండు రోజుల్లో చాలా తక్కువ కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా బిజినెస్ ప్రకారం మొదటి వీకెండ్ లోనే వీలైనంత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2.95 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా టార్గెట్ 19 కోట్లు అంటే ఇంకా బాక్సాఫీస్ వద్ద సుమారుగా 16 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. మరి సినిమా ఆదివారం రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











