Shaakuntalam Collections: 3వ రోజు కూడా డౌన్.. మరీ ఈ స్థాయిలో దెబ్బ కొడుతుందని ఊహించి ఉండరు!
సమంత రుత్ ప్రభు నటించిన శకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు దర్శకుడు తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది దారుణమైన నెగిటివ్ టాక్ తో కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి ఇక ఆదివారం రోజు చాలా ఏరియాలలో రెండు వారాల క్రితం వచ్చిన దసరా కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఇక మొత్తంగా మూడు రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్: శకుంతలం సినిమా విడుదలకు ముందు పెద్దగా ఐపోతే క్రియేట్ చేయలేకపోయింది కానీ సమంత వరుస ఇంటర్వ్యూ లతో కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది గుణశేఖర్ కూడా సినిమా గురించి అనేక విషయాలు చెబుతూ ఓ వర్గం ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించారు. ఇక డిమాండ్ కొత్త కట్టుగానే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయితే చేసింది దాదాపు 18 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
3వ రోజు తెలుగు స్టేట్స్ కలెక్షన్స్: శాకుంతలం ఏపీ తెలంగాణలో మొదటి రోజు 1.08 కోట్లు, రెండవ రోజు 51 లక్షల షేర్ అందుకుంది. ఇక 3వ రోజు ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజంలో 14 లక్షలు, సీడెడ్ లో 4 లక్షలు, ఉత్తరాంధ్రలో 5 లక్షలు, ఈస్ట్ లో 2 లక్షలు, వెస్ట్ లో 3 లక్షలు, గుంటూరులో 3 లక్షలు, కృష్ణాలో 4 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండవ రోజు 35 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

3 రోజుల ఏపీ నైజాం టోటల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ మూడవ రోజు మరింత తగ్గాయి. మొత్తంగా ఈ సినిమా ఏరియాల వారిగా రెండు రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 73 లక్షలు, సీడెడ్ లో 16 లక్షలు, ఉత్తరాంధ్రలో 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు, వెస్టులో 7 లక్షలు, గుంటూరులో 11 లక్షలు, కృష్ణ లో 12 లక్షలు, నెల్లూరులో 5 లక్షలు, ఏపీ తెలంగాణలో రెండు రోజుల్లో శాకుంతలం సినిమా 1.85 కోట్లు షేర్, 3.90 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.
వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్: ఇక ఆంద్రప్రదేశ్ తెలంగాణలో శాకుంతలం సినిమాకు మూడు రోజుల్లో 1.85 కోట్ల షేర్ రాగా తమిళనాడులో కేవలం 26 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటు నుంచి 27 లక్షల షేర్ వచ్చింది, ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా 90 లక్షలు మాత్రమే దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం సినిమాకు 3.40 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 6.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రాఫిట్ లోకి రావాలి అంటే..: శాకుంతలం సినిమా వీకెండ్ లో మరీ ఇంత దారుణమైన కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు అనుకోలేదు. అయితే ఈ సినిమా బిజినెస్ ప్రకారం మొదటి వీకెండ్ లోనే వీలైనంత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 కోట్లకు పై షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా టార్గెట్ 19 కోట్లు అంటే ఇంకా బాక్సాఫీస్ వద్ద ఇంకా సుమారుగా 16 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. మరి సోమవారం నుంచి ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











