Shaakuntalam Collections: అత్యధిక స్థాయిలో నష్టాలు చూడబోతున్న శాకుంతలం.. నిర్మాతలకు ఎదురుదెబ్బ!

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆమె తన స్టార్ ఇమేజ్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకోగలదు అని చాలాసార్లు రుజువు చేసింది. అయితే ఈసారి శాకుంతలం సినిమా విషయంలో మాత్రం ఇది వర్కౌట్ కాలేదు. ఈ సినిమాకు కలెక్షన్స్ మొదట్లోనే చాలా దారుణంగా వచ్చాయి. ఇక వీకెండ్ ముగిసిన అనంతరం కలెక్షన్స్ మరింత తగ్గుతూ వస్తున్నాయి. ఇక మొత్తంగా శాకుంతలం సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అని వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందంటే..:గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇక దిల్ రాజు కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మొత్తంగా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు టాక్. కానీ గుణశేఖర్ మాత్రం 80 కోట్ల వరకు అయినట్లు ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయితే చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Samantha Ruth Prabhu Shaakuntalam movie day 4 official Collections worldwide

4వ రోజు తెలుగు స్టేట్స్ కలెక్షన్స్:శాకుంతలం సినిమాకు ఏపీ తెలంగాణలో 4వ రోజు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే.. నైజంలో 17 లక్షలు, సీడెడ్ లో 4 లక్షలు, ఉత్తరాంధ్రలో 5 లక్షలు, ఈస్ట్ లో 2 లక్షలు, వెస్ట్ లో 3 లక్షలు, గుంటూరులో 3 లక్షలు, కృష్ణాలో 4 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండవ రోజు 30 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

4 రోజుల ఏపీ నైజాం టోటల్ కలెక్షన్స్:రెండు తెలుగు రాష్ట్రాల్లో శాకుంతలం సినిమా కలెక్షన్స్ 4వ రోజు మరింత తగ్గాయి. మొత్తంగా ఈ సినిమా ఏరియాల వారిగా 4 రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 90 లక్షలు, సీడెడ్ లో 21 లక్షలు, ఉత్తరాంధ్రలో 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 16 లక్షలు, వెస్టులో 10 లక్షలు, గుంటూరులో 14 లక్షలు, కృష్ణ లో 16 లక్షలు, నెల్లూరులో 7 లక్షలు, ఏపీ తెలంగాణలో రెండు రోజుల్లో శాకుంతలం సినిమా 2.05 కోట్లు షేర్, 4.05 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.

Samantha Ruth Prabhu Shaakuntalam movie day 4 official Collections worldwide

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్:ఆంద్రప్రదేశ్ తెలంగాణలో శాకుంతలం సినిమా 4 రోజుల్లో 1.85 కోట్ల షేర్ రాగా తమిళనాడులో కేవలం 30 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటు నుంచి 33 లక్షల షేర్ వచ్చింది, ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా 92 లక్షలు మాత్రమే దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం సినిమాకు 3.60 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 7.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఆ స్థాయిలో నష్టాలు వచ్చేలా..:శకుంతలం సినిమాను దర్శకుడు గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా గుణ టీమ్ వర్క్స్ తో కలిపి నిర్మించారు ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవాలని విడుదలకు ముందే చాలా ఏరియాలలో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారు కానీ ఆ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం4 కోట్లకు రేంజ్ లో షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా టార్గెట్ 19 కోట్లు అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా సుమారుగా 15 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ఇలానే కొనసాగితే సినిమాకు 10 కోట్లకు పైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X