Shaakuntalam Collections: 6వ రోజు కూడా మారని పరిస్థితి.. ఇంకా ఎంత వెనక్కి రావాలంటే..

సమంత ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ వస్తాయి అని ఇంతకుముందు ఆమె చేసిన కొన్ని సినిమాలతో రుజువయ్యింది. అయితే ఈసారి శాకుంతలం సినిమాకు మాత్రం అలాంటి ఫలితం దక్కలేదు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాకు 6వ రోజు కూడా ఏమాత్రం పెద్దగా కలెక్షన్స్ పెరగలేదు. చూస్తుంటే దిల్ రాజు గుణశేఖర్ భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాకు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకా ఎంత రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

Samantha Ruth Prabhu Shaakuntalam movie day 6 official Collections worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు: గుణశేఖర్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా ఇందులో దిల్ రాజుతో భాగస్వామ్యంగా సినిమాను నిర్మించారు.ఇక భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాను మొత్తంగా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. కానీ గుణశేఖర్ మాత్రం 80 కోట్ల వరకు అయినట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ అయితే చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

6వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్: శాకుంతలం సినిమా ఏపీ నైజాం లో మొదటి రోజు 1.08 కోట్ల షేర్ అందుకోగా రెండవ రోజు 51 లక్షలు వచ్చాయి. ఇక మూడవ రోజు 46 లక్షలు, 4వ రోజు 20 లక్షలు వచ్చాయి. ఇక 5వ రోజు మరింత దారుణంగా 12 లక్షలు వచ్చాయి. 6వ రోజు కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమి పెరగలేదు. కేవలం 8 లక్షల రేంజ్ లో షేర్ వచ్చినట్లు సమాచారం. ఇలా మొత్తంగా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2.43 కోట్ల షేర్, 4.80 కోట్ల గ్రాస్ దక్కింది.

Samantha Ruth Prabhu Shaakuntalam movie day 6 official Collections worldwide

6 రోజుల ఏపీ నైజాం టోటల్ కలెక్షన్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో శాకుంతలం సినిమా కలెక్షన్స్ 6వ రోజు మరింత తగ్గాయి. ఇక ఈ సినిమా ఏరియాల వారిగా 6 రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.01 కోట్లు, సీడెడ్ లో 24 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 19 లక్షలు, వెస్టులో 12 లక్షలు, గుంటూరులో 17 లక్షలు, కృష్ణ లో 19 లక్షలు, నెల్లూరులో 9 లక్షలు, ఏపీ తెలంగాణలో 6 రోజుల్లో శాకుంతలం సినిమా 2.43 కోట్లు షేర్, 4.80 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.

వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్: ఆంద్రప్రదేశ్ నైజాంలో శాకుంతలం సినిమా 6 రోజుల్లో 2.43 కోట్ల షేర్ రాగా తమిళనాడులో కేవలం 34 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటు నుంచి 37 లక్షల షేర్ వచ్చింది, ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా 1 కోటి షేర్ మాత్రమే. దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం సినిమాకు 4.20 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 9 రేంజ్ లో కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Samantha Ruth Prabhu Shaakuntalam movie day 6 official Collections worldwide

ఊహించని నష్టాలు: శకుంతలం సినిమా దర్శకుడు గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని విడుదలకు ముందు ఎంతో ధీమాతో కనిపించారు. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవాలని విడుదలకు ముందే చాలా ఏరియాలలో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారు.

కానీ ఆ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4 కోట్లకు రేంజ్ లో షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా టార్గెట్ 19 కోట్లు అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా సుమారుగా 14 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ఇలానే కొనసాగితే సినిమాకు 12 కోట్లకు పైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X