Shaakuntalam Collections: వారం రోజుల్లోనే సర్దేసుకుంటున్న శాకుంతలం.. ఇక క్లోజ్ అయినట్లే!
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన శాకుంతలం సినిమా ఊహించిన విధంగా డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ సినిమా అంచనాలకు భిన్నంగా నెగిటివ్ అందుకుని డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమా జనాల ముందుకు వచ్చి వారం రోజులు పూర్తయింది. ఇక ఈ ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అలాగే ఇంకా పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎంత వెనక్కి రావాలి అనే వివరాల్లోకి వెళితే..
ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?:గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం సినిమాకు ఆయన కూతురు నీలిమా గుణతో పాటు రాజుతో భాగస్వామ్యంగా సినిమాను నిర్మించారు. మైథలాజికల్ సినిమాగా వచ్చిన ఈ సినిమాను మొత్తంగా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ అయితే చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

వారం రోజుల ఏపీ నైజాం కలెక్షన్స్:శాకుంతలం సినిమా ఏపీ నైజాం లో ఫస్ట్ డే 1.08 కోట్ల షేర్ అందుకోగా రెండవ రోజు 51 లక్షలు వచ్చాయి. ఇక మూడవ రోజు 46 లక్షలు, 4వ రోజు 20 లక్షలు వచ్చాయి. ఇక 5వ రోజు మరింత దారుణంగా 12 లక్షలు వచ్చాయి. 6వ రోజు కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమి పెరగలేదు. కేవలం 8 లక్షల రేంజ్ లో షేర్ వచ్చినట్లు సమాచారం. ఇక 7వ రోజు అయితే అంతకంటే దారుణంగా 5 లక్షల లోపే వచ్చినట్లు టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 2.48 కోట్ల షేర్, 4.85 కోట్ల గ్రాస్ దక్కింది.
వారంలో వచ్చిన ఏపీ నైజాం టోటల్ కలెక్షన్స్:ఏపీ నైజాంలో శాకుంతలం సినిమా కలెక్షన్స్ 7వ రోజు మరింత తగ్గాయి. దాదాపు క్లొజింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమా ఏరియాల వారిగా 7 రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.05 కోట్లు, సీడెడ్ లో 25 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 19 లక్షలు, వెస్టులో 12 లక్షలు, గుంటూరులో 17 లక్షలు, కృష్ణ లో 19 లక్షలు, నెల్లూరులో 9 లక్షలు, ఏపీ తెలంగాణలో 6 రోజుల్లో శాకుంతలం సినిమా 2.48 కోట్లు షేర్, 4.85 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్:ఆంద్రప్రదేశ్ నైజాంలో శాకుంతలం సినిమా 7 రోజుల్లో 2.48 కోట్ల షేర్ రాగా తమిళనాడులో కేవలం 35 లక్షల షేర్ మాత్రమే దక్కింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటు నుంచి 38 లక్షల షేర్ వచ్చింది, ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా 1 కోటికి అటు ఇటుగా షేర్ మాత్రమే దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం సినిమాకు 4.28 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 9 రేంజ్ లో కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
ఇక క్లోజ్ అయినట్లే..:మొదటి రోజే టాక్ వలన ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయాయి. ఇక శకుంతలం సినిమా దర్శకుడు గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకున్నారు. రిలీజ్ కు ముందు ఎంతో ధీమాతో కనిపించారు. సినిమా ప్రీమియర్ షోల ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4 కోట్లకు రేంజ్ లో షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమా టార్గెట్ 19 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద ఇంకా సుమారుగా 14 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ఇక ఇప్పటికే చాలా ఏరియాల్లో షోలు లేక సినిమాను తీసేశారు. ఇక దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక శాకుంతలం సినిమాకు మొత్తంగా 12 నుంచి 13 కోట్ల మధ్యలో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











