Yashoda Collections: సమంత సినిమా హవా.. 12వ రోజు తగ్గినా కూడా.. మరో 35 లక్షలు వస్తే సంచలన రికార్డు

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలను అందుకుంటోన్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 'యశోద' అనే చిత్రంతో వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'యశోద' సినిమా 12 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

యశోదగా సమంత విశ్వరూపం

యశోదగా సమంత విశ్వరూపం

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'యశోద'. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. దీన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలను పోషించారు. దీనికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

 థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'యశోద' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో ఈ మూవీకి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.30 కోట్లు వ్యాపారం అయింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 12.50 కోట్ల బిజినెస్ చేసింది.

12వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

12వ రోజు ఎక్కడ ఎంతొచ్చింది?

సమంత నటించిన 'యశోద'కు 12 రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 21 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలైంది.

12 రోజులకు ఎంత వచ్చింది?

12 రోజులకు ఎంత వచ్చింది?

12 రోజుల్లో సమంత 'యశోద' మూవీకి వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి రూ. 8.60 కోట్లు షేర్, రూ. 15.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

12 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 8.60 కోట్లు వసూలు చేసిన 'యశోద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.28 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.73 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.85 కోట్లు షేర్‌, రూ. 29.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

క్రేజీ సబ్జెక్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'యశోద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.85 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.85 కోట్లు లాభాలు దక్కాయి.

మరో కోటి వస్తే సమంత రికార్డు

మరో కోటి వస్తే సమంత రికార్డు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోయేలా వచ్చాయి. ఇలా ఇప్పటికే ఈ సినిమా రూ. 29.65 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక, ఈ చిత్రానికి మరో రూ. 35 లక్షలు గ్రాస్ వస్తే.. 30 కోట్ల మైలురాయిని చేరి సంచలన రికార్డు నమోదు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X