Yashoda: స్టార్ హీరోల సినిమా రేంజ్‌లో యశోద.. సమంత ఖాతాలో నయా రికార్డు

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొందరు మాత్రం సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంటారు. తద్వారా స్టార్లుగా ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తుంటారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఒకరు. దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకెళ్తోన్న ఈ చిన్నది.. కొంత కాలంగా పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సమంత 'యశోద' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో వస్తుంది.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీ నవంబర్ 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్‌ బయటకు వచ్చింది.

Samantha Ruth Prabhus Yashoda Movie Worldwide Total Theaters Count

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'యశోద' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ మొత్తంలో జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 195, సీడెడ్‌లో 80, ఆంధ్రాలో 225 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 480 నుంచి 500 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 600, ఓవర్సీస్‌లో 240 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1350 నుంచి 1400 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. తద్వారా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఇది రికార్డు సాధించింది.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'యశోద' మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. దీన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X