Subham Box Office: సమంత గట్టిగానే కొట్టేసిందిగా.. శుభం మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెటైరికల్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రూపొందిన ఈ సినిమా మే 9వ తేదీన రిలీజైంది. ఈ సినిమా 5 రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. గత 6 రోజుల్లో ఈ మూవీ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బుల్లితెర ప్రేక్షకులపై టెలివిజన్ సీరియల్స్ ప్రభావం అనే పాయింట్‌తో సెటైరికల్ రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి (సమంత రెమ్యునరేషన్ మినహాయించి) బడ్జెట్‌ను 3.5 కోట్లుగా రౌండప్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 8 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా కోసం ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లకు కూడా మంచి రెస్సాన్స్ లభించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పాజిటివ్ రివ్యూస్‌తోపాటు మౌత్ టాక్ కూడా సానుకూలంగా ఉండటంతో శుభం సినిమా ఆడియెన్స్ అటెన్షన్ సంపాదించింది. ఈ సినిమా బ్రహ్మండమైన కలెక్షన్లు సాధించినప్పటికీ.. నిలకడగా, స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబడుతున్నది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఈ సినిమా ఫస్ట్ డే రోజు 60 లక్షల రూపాయలు నెట్, 2వ రోజు 75 లక్షలు, 3వ రోజు 90 లక్షలు, 4వ రోజు 45 లక్షలు, 5వ రోజు 50 లక్షలు, 6వ రోజు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆరు రోజుల్లో 3.75 కోట్లకుపైగా వసూళ్లను ఇండియాలో రాబట్టింది.
శుభం సినిమాకు నార్త్ అమెరికాలో కూడా ఫర్వాలేదనే విధంగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 250K డాలర్లు అంటే 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5 కోట్ల నెట్ 9 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా 5వ రోజునే బ్రేక్ ఈవెన్ సాధించింది. దాంతో సమంత నిర్మాతగా మొదటి సినిమాతోనే తెలుగు సినిమాకు శుభారంభాన్ని అందించింది.
శుభం సినిమా 6వ రోజు 50 లక్షలు, 7వ రోజు 40 లక్షలు, 8వ రోజు 25 లక్షలు, 9వ రోజు 25 లక్షలు, 10వ రోజు 25 లక్షలు, 11వ రోజు 20 లక్షల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు అంటే.. నైజాం, ఆంధ్రాతోపాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
శుభం సినిమా శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్‌ను జీ సంస్థ సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ వాల్యూ విషయానికి వస్తే.. సుమారుగా 3.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా బడ్జెట్ మొత్తాన్ని నాన్ థియేట్రికల్ బిజినెస్ తెచ్చిపెట్టింది. థియేట్రికల్‌గా వసూలైన కలెక్షన్లు మాత్రం సమంతకు అదనపు లాభాలుగా మారాయి. ఒకవేళ లాంగ్ రన్ కొనసాగిస్తే.. శుభం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసినట్టే అవుతుంది.


Click it and Unblock the Notifications











