Yashoda 9 days Collections రెండోవారంలో సమంత బాక్సాఫీస్ మ్యాజిక్.. వరల్డ్ వైడ్ 9వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం రెండో వారాంతంలో కొత్తగా రిలీజైన సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధించింది. తొలివారం తర్వాత బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురైన ఈ చిత్రం రెండో వారాంతంలో వసూళ్లపరంగా పుంజుకొన్నది. ఇప్పటికే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా 9 రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే?

తొలివారంలో యశోద వసూళ్లు
తొలివారం యశోద సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 12.45 కోట్లు, హిందీలో 7 లక్షలు, తమిళంలో 1.76 కోట్లు, మలయాళంలో 10 లక్షలు సాధించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.10 కోట్లు, అమెరికాలోనే 4.52 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 50 లక్షలకుపైగా కలెక్షన్లు వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా 13.92 కోట్లు నమోదు చేసింది.

రెండోవారాంతంలో పుంజుకొన్న కలెక్షన్లు
యశోద చిత్రం రెండో వారాంతం అంటే.. నవంబర్ 19వ తేదీన భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు అమెరికాలో దమ్మురేపే కలెక్షన్లు సాధించిన చిత్రం 9వ రోజు కూడా భారీ వసూళ్లు నమోదు చేసింది. భారీ తుఫాన్ కారణంగా తొలివారం అంతంతా మాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండోవారంలో కాస్త పుంజుకొన్నది. ఇక తెలుగులో కూడా అదే పరిస్థితి కనిపించింది. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేయడం సమంత స్టామినాకు అద్దంపట్టింది.

9వ రోజు అక్యుపెన్సీ
యశోద తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. 9వ రోజున దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. హైదరాబాద్‌లో 30 శాతం ఆక్యుపెన్సీ, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 75 శాతం, కాకినాడలో 68 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మిగితా ప్రాంతాల్లో 30 శాతం మేరకు ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. పాండిచ్చెరి, చెన్నై, కోయబత్తూరు, సాలెం, వెళ్లూరు, త్రిచీ ప్రాంతాల్లో 40 శాతం నుంచి 75 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.

9 రోజుల కలెక్షన్లు
యశోద చిత్రం రెండోవారంలో తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 63 లక్షలు వసూలు చేయగా, రెండో రోజు ఇంకా మెరుగైన వసూళ్లు రాబట్టింది. అలాగే 9వ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా 1.10 కోట్లు రాబట్టింది. తెలుగులో 84 లక్షలు, తమిళంలో 25 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 15.64 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా యశోద 9 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 15.64 కోట్లు షేర్ ఈ చిత్రం సాధించింది. ఇక అమెరికా, ఇతర దేశాల్లో వసూళ్లను పరిశీలిస్తే.. 600K డాలర్లకు అంటే.. 4.89 కోట్లకు చేరువైంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల షేర్, 30+ గ్రాస్ వసూళ్లను రాబట్టిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ తెలుగులో మినహాయించి.. అన్ని భాషల్లో సొంతంగా రిలీజ్ చేసింది కాబట్టి.. ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ లాంటి వివరాలు గురించి చర్చించాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.


Click it and Unblock the Notifications











