అనుష్క రికార్డ్‌ను కొట్టలేకపోయిన సమంత... లేడీ సూపర్‌స్టార్స్‌లో జేజేమ్మ డామినేషన్!

చిత్ర పరిశ్రమను రూల్ చేసేది స్టార్ హీరోలేనన్న సంగతి తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్స్, అదే స్థాయిలో వసూళ్లతో హీరోల చుట్టూనే చిత్ర పరిశ్రమ తిరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో హీరోయిన్ల పరిస్ధితి నామమాత్రం అయిపోయింది. ఒకరిద్దరు తప్పించి ముద్దుగుమ్మలంతా గ్లామర్ రోల్స్‌కే పరిమితం అవుతున్నారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలనే వణికించే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం సృష్టించగలమని నిరూపించారు. విజయశాంతి, అనుష్క, నయనతార, త్రిష, కంగనా రనౌత్, సమంత వంటి వారు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో చరిత్ర సృష్టించారు.

తాజాగా సమంత లీడ్ రోల్‌లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ తొలిరోజున భారీ ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 19న మా ఇంటి బంగారం మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. విడుదలకు ముందే బుకింగ్స్‌లో సత్తా చాటారు సమంత. తొలిరోజున మా ఇంటి బంగారం మూవీ ఇండియాలో 5.35 కోట్ల రూపాయల నెట్.. 6.20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

Samantha s Maa Inti Bangaram gets record Openings But Anushka Shetty Still Holds Top Place

ఇక నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + డే 1 కలిపి 217K డాలర్లు (2.04 కోట్ల రూపాయలు) వసూలు చేసింది సమంత మూవీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యూకే, సింగపూర్, మలేషియా తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో దాదాపు 700K డాలర్లు (6.60 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి తొలిరోజున మా ఇంటి బంగారం మూవీ 12.80 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 13.15 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమంత ప్రకటించారు. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఇదే ప్రథమం. దీంతో సమంతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే లేడీ సూపర్‌స్టార్స్‌లో అనుష్క రికార్డులను సమంత బ్రేక్ చేయలేకపోయారు. అనుష్క గతంలో అరుంధతి, భాగమతి, రుద్రమదేవి వంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించకున్నారు స్వీటీ. అలాగే బాక్సాఫీస్ లెక్కల్లో హీరోలకు హీరోయిన్లు ఏ మాత్రం తక్కువ కాదని అనుష్క ప్రూవ్ చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ఓపెనింగ్స్ విషయంలో ఆమె ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డును సమంత బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్వీటీ తన ప్లేస్‌ను నిలబెట్టుకున్నారు.

అనుష్క గతంలో నటించిన రుద్రమదేవి చిత్రం తొలిరోజున 19.65 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. సమంత మా ఇంటి బంగారం 13.15 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి ప్లేస్‌లో అనుష్క నటించిన భాగమతి (12.02 కోట్ల రూపాయలు), లోక ఛాప్టర్ 1 (6.68 కోట్ల రూపాయలు), మహానటి (5.90 కోట్ల రూపాయలు), కోలమావు కోకిల (4.95 కోట్ల రూపాయలు), అరుంధతి (4.80 కోట్ల రూపాయలు)తో నిలిచాయి. అయితే కొందరు మాత్రం భాగమతికి తొలిరోజున 15.2 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయని చెబుతున్నారు. అదే నిజమైతే తొలి రెండు స్థానాలు అనుష్క ఖాతాలో పడినట్లే.

ప్రస్తుతం బడా స్టార్ హీరోలే తొలిరోజున ఓపెనింగ్స్‌లో డబుల్ డిజిట్స్ నెంబర్స్‌ను రాబట్టానికి ఆపసోపాలు పడుతుండగా.. అనుష్క మాత్రం పలుమార్లు ఈ ఫీట్‌ను సాధించడం ఆమె స్టార్‌డమ్‌, ఛరిష్మాకు నిదర్శనమని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X