Shaakuntalam Day 2 Collections: రెండవ రోజే దారుణంగా పడిపోయిన నెంబర్స్.. ఇంకా ఎంత రావాలంటే?
గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అనుకున్న దానికంటే చాలా తక్కువగా వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండవ రోజు సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమీ పెరగకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ పండితుల అంచనాల ప్రకారం రెండో రోజు ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చు అనే వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ - బిజినెస్ : శాకుంతలం సినిమా లో దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లుగా ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ తెలియజేశారు. ఇక ఈ సినిమాకు హై రేంజ్ లోనే బిజినెస్ జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు 12.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే జరిగింది. ఇక మిగతా మొత్తం భాషల్లో కూడా 4 కోట్లు, ఓవర్సీస్ లో 1.80 కోట్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం సినిమా 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.

మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ : ఇక ఈ సినిమా మొదటి రోజు అనుకున్నంత స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. పెద్దగా పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు అలాగే రివ్యూలు కూడా అంతంత మాత్రంగానే రావడంతో శాకుంతలం సినిమా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.08 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
థియేట్రికల్ ఆక్యుపెన్సీ : శాకుంతలం సినిమా మొదటి రోజే థియేటర్ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా నమోదయింది. ఈ సినిమా 3D వర్షన్స్ లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇక రెండవ రోజు మార్నింగ్ షోలకు 9.79 శాతం, మధ్యాహ్నం షోలకు 17.36 శాతం సాయంత్రం షోలకు 15.20 శాతానికి ఆక్యుపెన్సీ నమోదయింది. ఇక మిగతా భాషల్లో అయితే పెద్దగా ఈ సినిమాకు థియేటర్ ఆక్యుపెన్సీ అయితే పెరగలేదు.
రెండవ రోజు ఎంత? : ఇక రెండో రోజు ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ ఏమీ పెరగలేదు అని తెలుస్తోంది. మొదటి రోజే కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇక రెండవ రోజు టాక్ కారణంగా ఆ ప్రభావం గట్టిగానే పడింది. ఇక శనివారం రోజు ఇండియా మొత్తంలో కూడా శాకుంతలం సినిమా 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

నష్టాలు రాకుండా ఉండాలి అంటే..: శుక్రవారం కంటే శనివారం రోజు కూడా కలెక్షన్స్ భారీగా తగ్గిపోవడంతో ఈ సినిమా ఆదివారం రోజు తప్పనిసరిగా కలెక్షన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ సినిమాకు కేవలం మూడు కోట్లకు అటు ఇటుగా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా చేసిన బిజినెస్ ను బట్టి 19 కోట్ల టార్గెట్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఈ ఈ సినిమా మరో 15 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. మరి ఆదివారం రోజు ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











