Shaakuntalam Collections: పెరిగిన వసూళ్లు.. ఒక్కరోజు అన్ని కోట్లు.. లాభాల్లోకి రావాలంటే?
ఎపిక్ మైథాలాజికల్ సినిమాగా వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత తాజా సినిమా శాకుంతలం. ప్రముఖ తెలుగు డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదల చేశారు. అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సైతం అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామ్ శాకుంతలం మూవీకి మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
థియేటర్ కౌంట్:మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించిన శాకుంతలం సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తరెకెక్కించిన విషయం తెలిసిందే. అందుకే ఈ మూవీని అధికంగా థియేటర్లలో విడుదల చేశారు. ఏపీ తెలంగాణలో సుమారు 400కుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..:దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత శాకుతంలం సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్ లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 6.50 కోట్లు మొత్తం కలుపుకుని రూ. 12.20 కోట్లుగా బిజినెస్ అయింది. ఇతర భాషల్లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.80 కోట్లు కాగా అన్ని కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 18 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.
ఆక్యుపెన్సీ డీటెల్స్:శాకుంతలం సినిమాకు మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో మూడో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. తెలుగు త్రీడీ వెర్షన్ లో ఉదయం 8.44 శాతం, మధ్యాహ్నాం 15.27 శాతం, సాయంత్రం 14.46 శాతంగా నమోదు అయింది. హిందీ త్రీడికి ఉదయం 7.75, మధ్యాహ్నాం 10.75, సాయంత్రం 11.60 శాతంగా ఫిక్స్ అయింది. ఇక తెలుగు 2డీ చూసుకుంటే ఉదయం 14.09, మధ్యాహ్నాం 25.09, సాయంత్రం 22.99 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.

మూడో రోజు వసూళ్లు..:సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం సినిమాకు మూడో రోజు వసూళ్లు రెండో రోజుతో పోల్చుకుంటే కాస్తా పెరిగినట్లుగా తెలుస్తోంది. రెండవ రోజు రూ. 1.85 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాగా మూడో రోజు మాత్రం రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం కావడంతో ఈ మాత్రం వసూళ్లు వచ్చినట్లుగా విశ్లేషకులు అంటున్నారు.
3 రోజుల్లో:అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ తొలిసారిగా నటించిన శాకుంతలం సినిమాకు ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ ప్రభావం కలెక్షన్లపై పడింది. అందుకే వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి 3 రోజుల్లో రూ. 6.85 కోట్ల వరకు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

లాభాలు రావాలంటే..:కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దుర్వాస మహర్షిగా అలరించిన శాకుంతలం సినిమాకు రెండు రోజుల్లో రూ. 6.15 కోట్ల గ్రాస్ రాగా.. రూ. 2.95 కోట్ల షేర్ వచ్చింది. అంటే రూ. 19 కోట్లుగా ఫిక్స్ అయిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలంటే రూ. 16.05 కోట్లు రావాలి. ఇక ఆదివారం వచ్చే వసూళ్లతో కలిపి సుమారుగా ఇంకా రూ. 14 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండవచ్చని తెలుస్తోంది. అంటే లాభాలు రావాలంటే ఇంకా 14 కోట్లు రావాలి.


Click it and Unblock the Notifications











