Shaakuntalam 5 Days Collections: సమంతకు మరో షాక్.. ఐదో రోజే ఇంత తక్కువ.. హిట్ అవ్వాలంటే మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలకే పరిమితం అయిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతోంది.
ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సమంత 'శాకుంతలం' అనే మూవీతో వచ్చింది. దీనికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్లు సాధించిందో మీరే చూసేయండి!

శాకుంతలగా మారిన సమంత: సమంత రూత్ ప్రభు - గుణశేఖర్ కాంబోలో వచ్చిన చిత్రమే 'శాకుంతలం'. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మించాయి. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీనికి మణి శర్మ సంగీతం ఇచ్చారు. ఇందులో దేవ్ మోహన్ మేల్ లీడ్‌గా చేయగా.. సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు నటించారు.
శాకుంతలం బిజినెస్ డీటేల్స్: సమంత రూత్ ప్రభు మార్కెట్‌తో పాటు 'శాకుంతలం'పై భారీ అంచనాలు ఏర్పడడంతో.. నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, వేరే భాషల్లో రూ. 4.00 కోట్లు, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.80 కోట్లతో కలిపి రూ. 18.00 కోట్ల బిజినెస్ అయింది.

ఐదో రోజు ఎంత రాబట్టింది?: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 12 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.
5 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?: 'శాకుంతలం'కు 5 రోజులకు కలిపి వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 2.37 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాణించని సమంత 'శాకుంతలం' మూవీకి 5 రోజుల్లో రూ. 2.37 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 36 లక్షలు, తమిళంలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 98 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 4.04 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.40 కోట్లు గ్రాస్ వసూలైంది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సమంత రూత్ ప్రభు నటించిన 'శాకుంతలం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 4.04 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.96 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

మరీ ఇంత తక్కువ వసూళ్లు: సమంత రూత్ ప్రభు - గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఆశించిన రీతిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్ రన్‌తోనే నడుస్తోంది. హిట్ అవ్వాలంటే మాత్రం ఇంకా దాదాపు రూ. 15 కోట్లు వరకూ వసూలు చేయాలి. అయితే, ఇదే రన్ కంటిన్యూ అయితే టార్గెట్ చేరడం కష్టమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











