Shaakuntalam 8 Days Collections: సమంతకు ఘోర పరాభవం.. 8 రోజుల్లో దారుణంగా.. అన్ని కోట్ల నష్టం తప్పదా!
అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. ఈ మధ్య కాలంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అమ్మడు.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పుడు 'శాకుంతలం' అనే చిత్రంతో వచ్చింది. దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు అంతగా రావడం లేదు. దీంతో ఈ చిత్రం నష్టాల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సమంత మూవీ 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

శాకుంతలగా వచ్చిన సమంత: సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో గుణశేఖర్ తీసిన చిత్రమే 'శాకుంతలం'. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మించాయి. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీనికి మణి శర్మ సంగీతం ఇచ్చారు. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించగా.. సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు కీలక పాత్రలు చేశారు.
శాకుంతలం బిజినెస్ డీటేల్స్: సమంత రూత్ ప్రభు నటించిన 'శాకుంతలం' మూవీపై భారీ అంచనాలు ఏర్పడడంతో నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, వేరే భాషల్లో రూ. 4.00 కోట్లు, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.80 కోట్లతో కలిపి రూ. 18.00 కోట్ల బిజినెస్ జరిగింది.

ఐదో రోజు ఎంత రాబట్టింది?: సమంత - గుణశేఖర్ కాంబినేషన్‌లో రూపొందిన 'శాకుంతలం' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు 8వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 5 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.
8 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?: 'శాకుంతలం'కు 8 రోజులకు కలిపి వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 35 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 2.50 కోట్లు షేర్, రూ. 4.80 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో నిరాశనే ఎదుర్కొన్న సమంత 'శాకుంతలం' మూవీకి 8 రోజుల్లో రూ. 2.50 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 37 లక్షలు, తమిళంలో రూ. 34 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 99 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 4.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సమంత ప్రధాన పాత్రలో వచ్చిన 'శాకుంతలం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 4.20 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.80 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు.


Click it and Unblock the Notifications











