Shaakuntalam 9 Days Collections: సమంత ఖేల్ ఖతం.. వీకెండ్‌లోనూ ఘోరంగా.. అన్ని కోట్లతో చెత్త రికార్డు
'ఏమాయ చేశావే' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. చాలా కాలం పాటు గ్లామరస్ రోల్స్ చేసిన ఈ భామ.. ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగానే గత వారంలోనే 'శాకుంతలం' అనే చిత్రంతో వచ్చింది. దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు అంతగా రావడం లేదు. దీంతో ఈ చిత్రం నష్టాల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సమంత మూవీ 9 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

శాకుంతలగా సమంత ఎంట్రీ: సమంత రూత్ ప్రభు - గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రమే 'శాకుంతలం'. ఈ మూవీని గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మించాయి. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీనికి మణి శర్మ సంగీతం ఇచ్చారు. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించగా.. సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు నటించారు.
శాకుంతలం బిజినెస్ డీటేల్స్: సమంత రూత్ ప్రభు క్రేజ్‌తో పాటు 'శాకుంతలం' మూవీపై భారీ అంచనాలు ఏర్పడడంతో నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, వేరే భాషల్లో రూ. 4.00 కోట్లు, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.80 కోట్లతో కలిపి రూ. 18.00 కోట్ల బిజినెస్ అయింది.

9వ రోజు ఎంత రాబట్టింది?: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి ప్రేక్షకుల నుంచి ఏమాత్రం మంచి స్పందన రావడం లేదు. దీంతో చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఫలితంగా ఈ సినిమాకు 9వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 5 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.
9 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?: 'శాకుంతలం'కు 9 రోజులకు కలిపి వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.07 కోట్లు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో కలిపి.. రూ. 2.55 కోట్లు షేర్, రూ. 4.90 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో ఆకట్టుకోలేకపోయిన సమంత 'శాకుంతలం' మూవీకి 9 రోజుల్లో రూ. 2.55 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 38 లక్షలు, తమిళంలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.00 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 4.28 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సమంత నటించిన 'శాకుంతలం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 4.28 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 14.72 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే దీనికి రూ. 14 కోట్లకు పైగానే నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది. అదే జరిగితే సమంత చెత్త రికార్డు నమోదు చేస్తుంది.


Click it and Unblock the Notifications











