Yashoda 10 Days Collections బాక్సాఫీస్‌ను కుమ్మేసిన సమంత మూవీ.. ఇప్పటి వరకు లాభం ఎంతంటే?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నటీమణుల్లో సమంత ఒకరు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంత చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా నార్త్ లో కూడా మోస్ట్ పాపులర్ అయింది. ఇటీవల కాలంలో లేడి ఒరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది సామ్. ఇటీవల యశోద సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరోగసి నేపథ్యంతో వచ్చిన ఈ మూవీకి మంచి టాక్ వస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన సమంత యశోద సినిమా 10 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాళ్లోకి వెళితే..

సరోగసి నేపథ్యంలో..
తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ రోల్ లోనటించిన తాజా చిత్రమే 'యశోద'. హరి అండ్ హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరోగసి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు.

థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్..
సమంత నటించిన 'యశోద' మూవీపై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో ఈ సినిమాకు రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.30 కోట్ల వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 11.50 కోట్ల బిజినెస్ అయింది.

10వ రోజు కలెక్షన్స్..
సమంత 'యశోద' మూవీకి 10వ రోజు వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 32 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి ఏపీ, తెలంగాణలో రూ. 72 లక్షలు షేర్, రూ. 1.30 కోట్ల గ్రాస్ వసూలైంది.

10 రోజుల్లో వచ్చింది ఎంతంటే..
సమంత 'యశోద' మూవీకి 10 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయని చెప్పవచ్చు. ఫలితంగా నైజాంలో రూ. 4.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో కలిపి రూ. 8.07 కోట్లు షేర్, రూ. 14.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే..
ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 8.07 కోట్లు వసూలు చేసిన 'యశోద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.20 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.65 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.07 కోట్లు షేర్, రూ. 27.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

హిట్ గా నిలిచిన యశోద..
క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'యశోద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.07 కోట్లు వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా.. రూ. 1.07 లాభంతో హిట్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











