Yashoda 14 Days Collections తగ్గుతున్న సమంత సినిమా కలెక్షన్లు.. 2 వారాల్లో లాభమెంతంటే?

సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్​ డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే యూత్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్న సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఇక ఈ మధ్య ఎక్కువగా లేడి ఒరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది సామ్. ఇటీవల యశోద సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరోగసి నేపథ్యంతో వచ్చిన ఈ మూవీకి 14 రోజుల అంటే 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాళ్లోకి వెళితే..

కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్..

కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత వివిధ భాషల్లో చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆమె మెయిన్ లీడ్ రోల్ లోనటించిన తాజా చిత్రం 'యశోద'. హరి అండ్ హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరోగసి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేశారు.

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే..

థియేట్రికల్ బిజినెస్ వివరాలివే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం 'యశోద'పై ప్రారంభం నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రా, తెలంగాణ ఏరియాల్లో ఈ సినిమాకు రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.30 కోట్ల వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 11.50 కోట్ల బిజినెస్ అయింది.

14వ రోజు కలెక్షన్స్..

14వ రోజు కలెక్షన్స్..

సమంత 'యశోద' మూవీకి 14వ రోజు వసూళ్లు అంతకుముందు రోజుతో పోల్చుకుంటే కొంతవరకు తగ్గాయి. సామ్ యశోద సినిమా 13వ రోజు మాత్రం రూ. 12 లక్షల వసూళ్లు రాబడితే 14వ రోజు నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో రూ. 8 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా రోజులు గడిచిన కొద్ది కలెక్షన్స్ తగ్గుతున్నాయి.

2 వారాల్లో (14 రోజులు) వచ్చింది ఎంతంటే..

2 వారాల్లో (14 రోజులు) వచ్చింది ఎంతంటే..

సమంత 'యశోద' మూవీకి 14 రోజుల్లో వచ్చిన వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ సినిమాకు నైజాంలో రూ. 4.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 89 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి రూ. 8.80 కోట్లు షేర్, రూ. 15.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

ఏపీ, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 8.80 కోట్లు వసూలు చేసిన 'యశోద' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఒక్క 14వ రోజు రూ. 12 లక్షల షేర్, రూ. 30 లక్షల గ్రాస్ తో పర్వాలేదనిపించింది. ఇక మొత్తం 14 రోజుల్లో (2 వారాలు) కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 1.31 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 1.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.76 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 14 రోజుల్లో సమంత యశోద సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.15 కోట్లు షేర్‌, రూ. 30.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

అన్ని కోట్ల లాభంతో హిట్ గా యశోద..

అన్ని కోట్ల లాభంతో హిట్ గా యశోద..

క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'యశోద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.15 కోట్లు వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా.. రూ. 2.15 కోట్ల లాభంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

యశోద రికార్డు..

యశోద రికార్డు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. అలాగే ఇందులో సమంత యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో ఈ సినిమాకు మొదటగా కలెక్షన్లు అదిరిపోయేలా ఉన్నా రోజులు గడిచే కొద్ది తగ్గుతున్నాయి. అయినా కూడా ఈ సినిమా ఇప్పటికి రూ. 30.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రూ. 2.15 కోట్ల లాభంతో రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X