Yashoda Day 1 Collections: పాజిటివ్ టాక్ తోనే పెరుగుతున్న కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత రావచ్చంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక బిగ్ బడ్జెట్ లేడి ఓరియంటెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా మూవీగా విడుదలయ్యింది. ఇద్దరు దర్శకులు హరి హరీష్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎంతవరకు కలెక్ట్ చేయబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా రిలీజ్

పాన్ ఇండియా రిలీజ్

యశోద సినిమాకు మొదటి నుంచి కూడా పాజిటివ్ టాక్ అయితే ఉంది. మొదట ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల చేయబోతున్నట్లు చిత్రం కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేసింది. అయితే హఠాత్తుగా సమంత కొంత అనారోగ్యానికి గురి కావడంతో ప్రమోషన్ లో పాల్గొనలేకపోయింది. అయినప్పటికీ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 బడ్జెట్ ఎంతంటే..

బడ్జెట్ ఎంతంటే..

యశోద సినిమాను మొదట కేవలం మూడు నుంచి నాలుగు కోట్ల బడ్జెట్లోనే తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత నిర్మాత కృష్ణ ప్రసాద్ కంటెంట్ కు తగ్గట్టుగానే పాన్ ఇండియా రేంజ్ లోనే తెరపైకి తీసుకురావాలి అని ఆలోచనతో కాస్త ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాకు మొత్తంగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో బడ్జెట్ అయినట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక బాక్సాఫీస్ వద్ద యశోద సినిమా డీసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్ లో 1.50 కోట్లు ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే 5.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్ర తెలంగాణ మొత్తంలో చూసుకుంటే 11.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కర్ణాటక స్టేట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్లు బిజినెస్ చేయగా.. ఇలా మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 15.50 కోట్ల వరకు యశోద సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం.

 హిందీ, తమిళ్ ఆక్యుపెన్సీ

హిందీ, తమిళ్ ఆక్యుపెన్సీ

ఇక మొదటి రోజు ఈ సినిమా థియేట్రికల్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హిందీలో కూడా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. హిందీలో మార్నింగ్ షోలకి 5.71 ఆక్యుపెన్సి నమోదు చేసిన సినిమా సాయంత్రం షోలకు 6.59 వరకు ఆక్యుపెన్సీ ని అందుకుంది. ఇక తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది మధ్యాహ్నం వరకు 19.97 ఆక్యుపెన్సి నమోదైంది. ఈవినింగ్ షోలకు 15.33 వరకు ఆక్యుపెన్సీ పెరిగింది.

 తెలుగు ఆక్యుపెన్సీ

తెలుగు ఆక్యుపెన్సీ

తెలుగులో అయితే సినిమాకు అన్ని భాషల్లో కంటే ఎక్కువగా థియేట్రికల్ ఆక్యుపెన్సీ దక్కింది. ఉదయం షోలకు 19.99 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా సాయంత్రం సమయానికి 29.94 శాతానికి పెరిగింది. శనివారం ఆదివారం కూడా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మళయాళ భాషలో కూడా సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం.

 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

ఇక యశోద సినిమా మొదటిరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనే వివరాల్లోకి వెళితే.. కొన్ని ఏరియాలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే దక్కినట్లు తెలుస్తోంది. అలాగే టాక్ పరంగా అయితే కొంత కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా మొదటి రోజు ఇండియాలో యశోద సినిమా 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X