Yashodha Pre Release Bussiness: సమంత బిగ్ బాక్సాఫీస్ టార్గెట్.. ఎంత రావాలంటే?
సమంత నటించిన యశోద సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉందని అందరిలో ఒక క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా చిత్ర యూనిట్ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇటీవల ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సినిమాకు కథ అనుకున్నప్పుడు దర్శకులు హరి హరీష్ ఇద్దరూ కూడా నాలుగు కోట్ల బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కంటెంట్ కు తగ్గట్టుగా ఈ సినిమాను నేర్పించాలి అని నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ చేసుకున్నారు ఈ సినిమా కోసం దాదాపు 35 కోట్ల నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చయినట్లు కూడా ఆయన తెలియజేశారు.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే సినిమా ద్వారా నిర్మాత ప్రాఫిట్ లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ నైజాం ఏరియాల్లో ఏషియన్ సినిమాస్ విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యశోద సినిమా 21 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే దాదాపు 22 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక తెలుగులో అయితే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక హిందీలో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది సినిమా విడుదల అయ్యే వరకు ఊహించడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాగే తమిళ్ మలయాళం లో కూడా ఈ సినిమాను భారీగానే విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా సమంత ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











