50 కోట్లకు చేరువగా మా ఇంటి బంగారం.. బాక్సాఫీస్‌పై సమంత ర్యాంపేజ్!
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. దక్షిణాది ఇండస్ట్రీలో కలెక్షన్లను రాబట్టానికి కష్టమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా అంచనాలను మంచి వసూళ్లను సాధిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపిస్తున్నది. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల రూపాయలకు చేరువ అవ్వడం సినీ వర్గాల్లో కూడా ఛర్చనీయాంశమైంది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సుమారుగా 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంపై భారీ నమ్మకాలు ఉండటంతో ఏరియా వారీగా హక్కులను అమ్మకపోగా.. కమీషన్ బేస్ మీద సొంతంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 35 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 36 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో థ్రియేట్రికల్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సమంత నటించిన ఈ చిత్రం తొలి రోజు అంచనాలకు మించి వసూళ్లను సాధించింది. ఇండియాలో ఈ చిత్రం 5.35 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. తెలంగాణలో 2.64 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. కర్ణాటకలో 80 లక్షల రూపాయలు, తమిళనాడులో 17 లక్షల రూపాయలు వసూలు చేసింది. విడుదలైన ప్రతీ చోట పాజిటివ్ రిపోర్టును సొంతం చేసుకొన్నది.
మా ఇంటి బంగారం చిత్రం తొలి రోజు కంటే రెండో రోజు అధికంగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం 2వ రోజు 7.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలంగాణలో 3.45 కోట్ల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 30 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మూడో రోజు కూడా అదే జోరును బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. ఈ చిత్రం తొలి రెండ్రోజుల కంటే మూడో రోజు భారీగా వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం మూడో రోజున 10 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది. తెలంగాణలో 4.2 కోట్ల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 3.13 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.65 కోట్ల రూపాయలు, తమిళనాడులో 30 లక్షల రూపాయలు, మహారాష్ట్రలో 15 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రం గత మూడు రోజుల్లో ఇండియాలో 24 కోట్ల మేర నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 9.45 కోట్ల రూపాయలు మేర వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications