Samarasimha Reddy Advance Booking: సమరసింహారెడ్డి రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్.. బాలకృష్ణ మూవీ రిలీజ్ ఎప్పడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ సమరసింహారెడ్డి. అప్పట్లో సెన్సేషనల్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చెంగల వెంకట్రావు నిర్మించారు. ఈ చిత్రంలో అంజలా జవేరి, సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించారు. జయచిత్ర, జయప్రకాశ్ రెడ్డి, సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, పృథ్వీ, శివ పార్వతి, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సుజిత, జయలలిత, వేణు మాధవ్, దేవ రాజ్, ఏవీఎస్, బండ్ల గణేష్, రమ్యశ్రీ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విజయేంద్ర ప్రసాద్, రత్నకుమార్, పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. సినిమాటోగ్రఫి: వీఎస్ఆర్ స్వామి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మ్యూజిక్: మణిశర్మ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 1999 సంవత్సరం జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం జూన్ 10వ తేదీ సందర్భంగా ఈ మూవీని మరోసారి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను లేటేస్ట్ టెక్నాలజీలోకి మార్చి విడుదలకు ముస్తాబు చేశారు. ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా రంగంలో అత్యంత భారీ తారాగణంతో, టాలెంటెడ్ టెక్నిషియన్లతో ఈ సినిమాను చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ చిత్రం అప్పట్లో సుమారుగా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు లేటేస్ట్ టెక్నాలజీ హంగులు అద్దారు. 4K టెక్నాలజీ, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో ఈ సినిమాను నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రెడీ చేశారు. ఇటీవల ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను నైజాం, అంధ్రాలోనే కాకుండా, కన్నడ, ఓవర్సీస్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా భారీగా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
నైజాంలో ఈ సినిమాను అడ్వాన్స్ బుకింగ్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భ్రమరాంబ థియేటర్, సుదర్శన్ 35 థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. వైజాగ్ సంగం థియేటర్, విజయవాడ అలంకార్ థియేటర్‌లోను అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాను అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. సినిమార్క్ థియేటర్లలో పలు ప్రదేశాల్లో ప్రదర్శనకు ప్లాన్ చేసింది. యూఎస్‌లో జూన్ 9వ తేదీన ఒకే ఒక షోను ప్రదర్శిస్తున్నట్టు తెలిపింది.


Click it and Unblock the Notifications