Samarasimha Reddy Box Office: షాకింగ్‌గా సమరసింహారెడ్డి కలెక్షన్లు.. బాలకృష్ణ మూవీ రీ రిలీజ్‌ వసూళ్లు ఎంతంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ సమరసింహారెడ్డి. అప్పట్లో సెన్సేషనల్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చెంగల వెంకట్రావు నిర్మించారు. ఈ చిత్రంలో అంజలా జవేరి, సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించారు. జయచిత్ర, జయప్రకాశ్ రెడ్డి, సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, పృథ్వీ, శివ పార్వతి, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, సుజిత, జయలలిత, వేణు మాధవ్, దేవ రాజ్, ఏవీఎస్, బండ్ల గణేష్, రమ్యశ్రీ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విజయేంద్ర ప్రసాద్, రత్నకుమార్, పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. సినిమాటోగ్రఫి: వీఎస్ఆర్ స్వామి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మ్యూజిక్: మణిశర్మ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 1999 సంవత్సరం జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం జూన్ 10వ తేదీ సందర్భంగా ఈ మూవీని మరోసారి గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Samarasimha Reddy Box Office Collections

తెలుగు సినిమా రంగంలో అత్యంత భారీ తారాగణంతో, టాలెంటెడ్ టెక్నిషియన్లతో ఈ సినిమాను చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ చిత్రం అప్పట్లో సుమారుగా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా గురించిన రీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఈ సినిమాను లేటేస్ట్ టెక్నాలజీలోకి మార్చి విడుదలకు ముస్తాబు చేశారు. 4K సాంకేతికత, డాల్బీ సౌండ్ సిస్టమ్ లాంటి అంశాలతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌కు తగినట్టుగా రీ రిలీజ్ నేపథ్యంలో ఆదరణ కనిపించలేదు. ఈ చిత్రానికి నందమూరి ఫ్యాన్స్ నుంచి కూడా భారీగా స్పందన కనిపించకపోవడంతో పెద్దగా బాక్సాఫీస్‌ను ప్రభావితం చేయలేకపోయిందనే విషయం తాజా కలెక్షన్లతో స్పష్టమైంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమాను ఆంధ్రా, నైజాం, కర్ణాటక, ఓవర్సీస్‌లో భారీగా రిలీజ్ చేశారు. దాదాపు 80 పట్టణాల్లో, 110 లోకేషన్లలో 120 స్క్రీన్లలో 300 లకుపైగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సుమారుగా 30 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 40 లక్షల రూపాయలు తొలి రోజు వసూలు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు ఎక్కువగా క్రేజ్ కనిపించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో ఈ చిత్రాన్ని సుమారుగా 30 లోకేషన్లలో ప్రదర్శించారు. తద్వారా సుమారుగా 8 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 8 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్ట్ వెంకీ తెలిపారు.

ఈ సినిమా రెండో రోజు కూడా థియేటర్‌లో రన్ అవుతున్నది. ఈ చిత్రం సుమారుగా 10 లక్షల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. రెండో రోజు 60కి పైగా లోకేషన్లలో 65 స్క్రీన్లలో 100కుపైగా షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు. ఈ చిత్రం ఎన్ని రోజులు థియేట్రికల్ రన్ కొనసాగిస్తుంది? ఎంత వసూలు చేస్తుందనే వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X