ఈ వారం కూడా రవితేజ కిక్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరంలో "అరుంధతి" తర్వాత ఇదే పెద్ద హిట్ అన్న టాక్ విన్పిస్తోంది. ఈ వారం ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. కృష్ణ-విజయనిర్మల చిత్రం "నేరము-శిక్ష" టైటిల్ లాగానే పరమ పాత నవలా చిత్రం. పాత నవలా చిత్రాలు ఇప్పుడు ఆడవన్న సంగతిని నిర్మాత, దర్శకులు గ్రహించినట్టు లేదు. శివాజీ "డైరీ" గంద్రగోళం సినిమాగా ముగిసింది. ముమైత్ ఖాన్ తన "టార్గెట్" ను రీచ్ కాలేకపోయింది. ఇక సుమన్ "ఉషా పరిణయం" గురించి ప్రస్తావించకపోవడమే మంచిది. మనోజ్ కుమార్ "ప్రయాణం" కాస్త కుదుటపడినట్టు కన్పిస్తోంది. కొత్తదనం ఈ సినిమాకు ఆక్సిజన్ ను ఇచ్చింది.
Story first published: Friday, June 5, 2009, 12:39 [IST]