»   » పాజిటివ్ టాక్‌తో సమ్మోహనం ముందుకు, 10 రోజుల కలెక్షన్ రిపోర్ట్

పాజిటివ్ టాక్‌తో సమ్మోహనం ముందుకు, 10 రోజుల కలెక్షన్ రిపోర్ట్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Sammohanam 10 Fays Box Office Collections Report

    సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఇరగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాస్యం, భావోద్వేగమైన కథనాలతో ఇంద్రగంటి ఈ చిత్రాన్ని నడిపించారు. తొలి షో నుంచే సమ్మోహనం చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం అయింది. తొలి వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ వీక్ డేస్ లో కలెక్షన్స్ పడిపోయాయి. తాజాగా 10 రోజుల కలెక్షన్స్ వివరాల ప్రకారం ఈ చిత్రం నష్టాల దిశగా పయనిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

    తొలి షో నుంచే పాజిటివ్ టాక్

    తొలి షో నుంచే పాజిటివ్ టాక్

    సమ్మోహనం చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు చాలా కాలం తరువాత హిట్ సొంతం చేసుకున్నాడని అంతా భావించారు. కానీ సెకండ్ వీక్ లో సమ్మోహనం బాక్స్ ఆఫీస్ రన్ చూస్తుంటే సమ్మోహనం చిత్రం యావరేజ్ చిత్రంగా మిగిలిపోనున్నట్లు తెలుస్తోంది.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10 రోజులకు గాను 4.13 కోట్ల షేర్ ని సమ్మోహనం చిత్రం రాబట్టింది. కృష్ణ ఏరియాలో 43 లక్షలు, ఈస్ట్, వెస్ట్ లో 60 లక్షలు రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 6 కోట్లకు పైగా జరిగింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచ వ్యాప్తంగా సమ్మోహనం చిత్రం 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ వరకు రాబట్టడం విశేషం. రెండవ వారంలో కలెక్షన్స్ బాగా తగ్గడంతో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

    15 శాతం వరకు

    15 శాతం వరకు

    సమ్మోహనం చిత్రం ఫుల్ రన్ లో 85 శాతం వసూళ్లు రికవరీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 15 శాతం అక్కడక్కడా స్వల్ప నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా సమ్మోహనం చిత్రం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ యావరేజ్ చిత్రంగా మిగలనుంది.

    English summary
    Sammohanam 10 days box office collections report. Sammohanam will end as average movie
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more