సమ్మోహనం ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్!
హీరో సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరో మరు తనదైన శైలిలో చిత్రాన్ని తెరకెక్కించి మ్యాజిక్ చేశారు. సుధీర్ బాబు, అదితి రావు హైదరి నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది.

సుధీర్ బాబు చిత్రాలలో
కలెక్షన్ల పరంగా ఈ చిత్రం సుధీర్ బాబుకు రెండవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో సమ్మోహనం చిత్రం 4.9 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం.

ఏరియాలవారీగా
నైజం ఏరియాలో 1.7 కోట్లు, సీడెడ్ లో 50 లక్షలకు పైగా, గుంటూరు లో 30 లక్షలకు పైగా రాబట్టింది. కృష్ణా ఏరియాలో 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 25 లక్షలు వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా
ప్రపంచ వ్యాప్తంగా సమ్మోహనం చిత్రం 7 కోట్లకు పైగా రాబట్టింది. ఓవర్సీస్ మంచి ప్రదర్శన కనబరిచింది. అక్కడ కోటి 90 లక్షలు రాబట్టడం విశేషం. శాటిలైట్ హక్కులు అన్నీ కలుపుకుంటే నిర్మాతకు మంచి లాభాలు దక్కినట్లు తెలుస్తోంది.

వెంటనే మరో చిత్రం
సుధీర్ బాబు సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. సమ్మోహనం చిత్రం ముగియగానే మరో చిత్రంతో రెడీ అవుతున్నాడు. సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందువటే చిత్రంతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











