Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కలెక్షన్స్ రిపోర్ట్: సమ్మోహనం హిట్టే.. కానీ, ఇంకా ఎంత వసూలు చేయాలంటే!
Recommended Video
సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరోమారు సున్నితమైన కథతో ప్రేక్షకులని మెప్పించాడు. మంచి హాస్యం, ఆకట్టుకునే రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం కావడంతో కమర్షియల్ గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ సమ్మోహనం చిత్రానికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురీత తప్పడం లేదు.
పాజిటివ్ టాక్
సమ్మోహనం చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మరే చిత్రం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా సమ్మోహనం చిత్రానికి కలసి వచ్చే అంశం అని చెప్పొచ్చు.
సుధీర్ కెరీర్ లోనే అత్యధికం
సమ్మోహనం
చిత్రం
తొలి
వారం
ముగిసేసరికి
4.90
కోట్ల
షేర్
వసూలు
చేసినట్లు
తెలుస్తోంది.
సుధీర్
తొలివారం
రికార్డ్స్
పరిశీలిస్తే
సమ్మోహనం
చిత్రం
అత్యధికం
అని
ట్రేడ్
పండితులు
అంటున్నారు.
సినిమా హిట్టే కానీ
సమ్మోహనం చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ హిట్ గా నిలవాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ జోరు సరిపోదని అంటున్నారు. తొలివారంముగిసిపోయింది. ఇకరాబట్టవలసిన మొత్తం భారీగానే ఉంది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా కలిపి ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 6 కోట్లవరకు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు 55 శాతం షేర్ మాత్రమే రికవరీ అయినట్లు తెలుస్తోంది.
బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే
రెండు
తెలుగు
రాష్ట్రాల్లో
ఈ
చిత్రం
3.16
కోట్ల
షేర్,
రెస్టాఫ్
ఇండియాలో
0.25
కోట్ల
షేర్
రాబట్టింది.
చిత్రం
బ్రేక్
ఈవెన్
సాధించాలి
అంటే
ఇంకా
2.5
కోట్లకు
పైగానే
వసూళ్లు
సాధించాల్సి
ఉంటుంది.
రెండవవారం
సాధారణంగా
వసూళ్లు
తగ్గుముఖం
పడుతాయి.
ఈ
నేపథ్యంలో
సమ్మోహనం
చిత్రం
కమర్షియల్
హిట్
గా
నిలుస్తుందా
లేదా
అనే
విషయం
చర్చనీయాంశంగా
మారింది.
ఓవర్సీస్ లో ఒకే
ఓవర్సీస్ లో సమ్మోహనం చిత్రం మంచి రన్ నే కొనసాగిస్తోంది. 75 శాతం రికవరీ సాధించింది. ఓవర్సీస్ లో సమ్మోహనం చిత్రం 1.50 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.