దూసుకుపోతున్న ‘కొబ్బరి మట్ట’.. రికార్డు స్థాయిలో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు.
ఈ సినిమాకు సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించగా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఈ సినిమా గత శనివారం విడుదలైంది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ 'కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది.

'కొబ్బరి మట్ట' మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 62 లక్షల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 63 లక్షల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా సాధించిన మొత్తాన్ని కలుపుకుని రూ. 71 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 1.17 కోట్ల షేర్, రూ. 2.2 కోట్ల గ్రాస్ సాధించింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 2 కోట్లు జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం 'కొబ్బరి మట్ట' రూ. 2.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే రూ. 2.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎలాగో మంచి టాక్ సంపాదించింది కాబట్టి మిగిలిన మొత్తం కూడా సులభంగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో సత్తా చాటిన ఈ సినిమా.. సోమవారం నుంచి ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











