మూడు రోజుల్లో రికార్డు.. కలెక్షన్స్ పేరుతో ఫూల్ చేసిన సంపూ.. ఆ హీరోలకు సెటైర్ వేసేశాడుగా.!

తెలుగు సినీ ఇండస్ట్రీకి అనూహ్య పరిస్థితుల్లో పరిచయమై, విచిత్రమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఈ సినిమా కలెక్షన్లపై చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ చర్చనీయాంశం అవుతోంది.

మంచి స్పందన

మంచి స్పందన

ఈ సినిమాకు సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించగా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఈ సినిమా గత శనివారం విడుదలైంది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ ‘కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది.

రెండు రోజులు రికార్డు స్థాయిలో

రెండు రోజులు రికార్డు స్థాయిలో

‘కొబ్బరి మట్ట' మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 62 లక్షల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 63 లక్షల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా సాధించిన మొత్తాన్ని కలుపుకుని రూ. 71 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 1.17 కోట్ల షేర్, రూ. 2.2 కోట్ల గ్రాస్ సాధించింది.

మూడో రోజు అనూహ్యంగా..

ఇక, మూడో రోజు కూడా ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టుకుంది. వాస్తవానికి సోమవారం నుంచి స్పందన తగ్గుతుందని అనుకున్నప్పటికీ, దానికి భిన్నంగా జరిగింది. దీంతో మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో 12 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ మేరకు చిత్ర హీరో సంపూర్ణేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు.

పోస్టర్‌లోనే క్లారిటీ ఇచ్చేశాడు

పోస్టర్‌లోనే క్లారిటీ ఇచ్చేశాడు

ఈ సినిమా కలెక్షన్లు రెండు రోజుల్లో రెండు కోట్లు ఉంటే.. మూడు రోజులకు 12 కోట్ల రూపాయలు అనడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, అదే పోస్టర్‌లో కింద ‘ఫ్యాన్స్ కోసం రూ. 9 కోట్ల ఫేక్ కలెక్షన్లు యాడ్ చేశాం' అని పేర్కొన్నారు. అంటే ఈ సినిమాకు మూడు రోజుల్లో మొత్తం రూ. 3 కోట్లు వచ్చాయన్న మాట.

వాళ్లకు సెటైర్

వాళ్లకు సెటైర్

సంపూర్ణేశ్ బాబు అండ్ టీమ్ ‘కొబ్బరి మట్ట'లో తెలుగు సినిమాలపై ఎన్నో సెటైర్లు వేసింది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ తనదైన శైలితో ఆకట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఫేక్ కలెక్షన్లు చెప్పుకుంటున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి వాళ్లకు సెటైరె వేయాలన్న ఉద్దేశ్యంతోనే చిత్ర యూనిట్ ఈ పోస్టర్ వదిలిందన్న టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X