కొబ్బరిమట్ట క్లోజింగ్ కలెక్షన్లు.. 100 శాతం లాభాలు.. సంపూ క్రేజ్‌తో!
Recommended Video
హృదయ కాలేయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంపూర్ణేష్ బాబు మరో చిత్రంలో కనిపించడానికి మరో ఐదేళ్లు పట్టింది. తన రెండో చిత్రంగా నటించిన కొబ్బరిమట్ట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ నాలుగు సంవత్సరాలకుపైగానే పట్టింది. చివరకు భారీ క్రేజ్ మధ్య ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొబ్బరిమట్ట చిత్రం భారీగా ఓపెనింగ్స్ సాధించింది. గత 14 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

భారీ సినిమాలకు ధీటుగా
హృదయం కాలేయం సినిమా హిట్ తర్వాత సంపూర్ణేష్ బాబు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానికి తోడు కొబ్బరిమట్ట టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. సంపూ చెప్పిన డైలాగ్స్ మరింత క్రేజ్ రాజేసింది. దాంతో తొలి రోజున మన్మథుడు2 సినిమాకు సమానంగా కలెక్షన్లు రాబట్టింది. వారాంతం వసూళ్లు కూడా ట్రేడ్, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సంతోషాన్ని నింపాయి.

తెలుగు రాష్ట్రాల్లో
గత 14 రోజుల్లో కొబ్బరి మట్ట తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజై మంచి వసూళ్లను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.3.04 కోట్ల వసూళ్లను రిజిస్టర్ చేసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్‌కు సంతోషాన్ని నింపింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో సంపూర్ణేష్ ఓ మోస్తారుగా కలెక్షన్లు రాబట్టాయి. రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 3.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో సంపూకు సినిమాకు ఈ విధంగా కలెక్షన్లు రాబట్టడం ఆయన మార్కెట్ విస్తరణపై ట్రేడ్ వర్గాల్లో ఓ అంచనా వచ్చింది.

ఓవరాల్‌గా 100 శాతానికిపైగా
ఇక ప్రపంచవ్యాప్తంగా కొబ్బరిమట్ట సినిమా 100 శాతం లాభాలను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మొత్తంగా రూ.6.55 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.2.50 కోట్లకుపైగా లాభాల్ని సంపాదించింది. ఈ మధ్యకాలం ఓ చిన్న సినిమా లాభాలను పంచిపెట్టడం కొబ్బరిమట్టతోనే సాధ్యమైందనే మాట వినిపిస్తున్నది.

ప్రీ రిలీజ్ బిజినెస్
రూపక్ రొనాల్డ్ దర్శకత్వం వహించిన కొబ్బరిమట్ట చిత్రం థియేట్రికల్ హక్కులు రూ.2 కోట్లకు అమ్ముడుపోయాయి. నైజాం హక్కులను రూ.85 లక్షలకు బిజినెస్ జరిగింది. దాంతో రూ.2.50 కోట్ల వద్ద బ్రేక్ ఈవెన్‌ను కూడా సునాయసంగా అధిగమించడంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పిల్చుకొన్నారు.


Click it and Unblock the Notifications











