సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని క్లోజింగ్ కలెక్షన్లు... శివాజీ మూవీకి లాభమెంత? నష్టమెంత?

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మించిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని. ఈ మూవీలో శివాజీ సరసన లయ హీరోయిన్‌గా నటించారు. మార్చి 6వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు.

Also Read
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? శివాజీ మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాలు పరిశీలిస్తే..

Sampradayini Suppini Suddapoosani Box Office Collections Worldwide Sivaji s film Closing Collections at Global Box Office Report

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చు కలిపి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాకు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్‌‌లతో ముందు నుంచే సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ కార్యక్రమాలతో బజ్ తగ్గకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంది. శివాజీ మూవీకి తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల రేంజ్‌‌లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ లాభాల్లోకి రావాలంటే 4 కోట్ల రూపాయల షేర్.. 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.

Recommended For You
Bigg Boss: 3 నెలలైనా అందని ప్రైజ్‌మనీ.. బిగ్‌బాస్ విన్నర్ ఎమోషనల్ పోస్ట్
Bigg Boss: 3 నెలలైనా అందని ప్రైజ్‌మనీ.. బిగ్‌బాస్ విన్నర్ ఎమోషనల్ పోస్ట్

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని కలెక్షన్స్
సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీకి తొలిరోజున 20 లక్షల రూపాయలు, రెండో రోజున 23 లక్షల రూపాయలు, మూడో రోజున 23 లక్షల రూపాయలు, నాలుగో రోజున 14 లక్షల రూపాయలు, ఐదో రోజున 13 లక్షల రూపాయలు, ఆరో రోజున 10 లక్షల రూపాయలు, ఏడో రోజున 15 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. దాంతో ఇండియాలో శివాజీ మూవీ ఇప్పటి వరకు 1.10 కోట్ల రూపాయల నెట్.. 1.18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

You May Also Like
'చేతకాక మా మీద తోసేస్తున్నారు... చిరంజీవి మూవీ కోసం తలవంచుతున్నా’
'చేతకాక మా మీద తోసేస్తున్నారు... చిరంజీవి మూవీ కోసం తలవంచుతున్నా’

ఇక సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఈ సినిమాకు నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలో కలిపి ఇప్పటి వరకు 87,777 డాలర్లు ( భారత కరెన్సీలో 81 లక్షల రూపాయలు) చొప్పున వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు రాబట్టింది.

Bigg Boss: దమ్ము శ్రీజపై జడ్జి ఆగ్రహం.. షర్ట్ విసిరికొడుతూ ఆ షో నుంచి వాకౌట్‌
Bigg Boss: దమ్ము శ్రీజపై జడ్జి ఆగ్రహం.. షర్ట్ విసిరికొడుతూ ఆ షో నుంచి వాకౌట్‌

శివాజీ మూవీకి లాభమెంత? నష్టమెంత?
ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా.. మంచి హైప్‌తో విడుదలైంది. అయితే ప్రేక్షకులను అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఫస్ట్ వీకెండ్‌లోనూ దక్కిన మంచి అవకాశాన్ని కూడా శివాజీ సినిమా మిస్ చేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. వర్కింగ్ డేస్, పరీక్షల సీజన్ ఈ సినిమాను దెబ్బకొట్టాయి. దాంతో సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమా సోమవారం నుంచి క్రమంగా వసూళ్లు కోల్పోతూ వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 8 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉండగా కేవలం 2 కోట్ల మాత్రమే వసూలు చేసింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ షేర్‌పరంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా.. 1.50 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దాంతో ఈ సినిమా 3 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, డబ్బింగ్ హక్కులతో నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లుగా భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X