Sampradayini Suppini Suddapoosani Day 1 Collections: శివాజీ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ ఇటీవల దూకుడు పెంచారు. ఓటీటీల రాకతో ఆయనకు డిమాండ్ ఏర్పడింది. గతేడాది కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ ప్రస్తుతం చిన్న నిర్మాతలకు భరోసాగా నిలిచారు. తాజాగా ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. తొలుత ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్న ఈ సినిమాను పలువురు సినీ ప్రముఖుల సూచన మేరకు థియేటర్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా మార్చి 6వ తేదీన సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని తారాగణం
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాలో శివాజీ సరసన సీనియర్ హీరోయిన్ లయ జంటగా నటించారు. హిట్ పెయిర్‌గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట చాలా రోజుల తర్వాత కలిసి నటించడం ఆసక్తిని కలిగించింది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Sampradayini Suppini Suddapoosani Day 1 Expected Box Office Collections Worldwide Sivaji s film poor Starting at GBOC

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చు కలిపి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాకు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓటీటీ రిలీజ్ నుంచి థియేటర్‌లో విడుదల చేసే విషయంలో ముందు అనుకున్న దానికంటే కాస్త ఖర్చు పెరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు శివాజీ.

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బ్రేక్ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్‌‌లతో ముందు నుంచే సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది చిత్ర యూనిట్. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 8 కోట్ల రూపాయల షేర్.. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని ఓపెనింగ్స్
తొలి నుంచి ప్రేక్షకుల్లో అంచనాల నేపథ్యంలో సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాకు మంచి బుకింగ్ నమోదైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో శివాజీ సినిమాకు 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 171 షోలు, బెంగళూరులో 71 షోలు, విజయవాడలో 60 షోలు, విశాఖపట్నంలో 53 షోలు ప్రదర్శితమైనట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాకు ఇండియాలో 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ ట్రెండ్‌ని బట్టి శివాజీ సినిమాకు తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 50 లక్షల రూపాయల చొప్పున 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X