Sampradayini Suppini Suddapoosani Day 2 Collections: శివాజీ మూవీకి దారుణమైన కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ నిర్మాతగా మారి తెరకెక్కించిన మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మార్చి 6వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో శివాజీ సరసన సీనియర్ హీరోయిన్ లయ జంటగా నటించారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు. రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చు కలిపి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాకు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్‌లతో ముందు నుంచే సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ కార్యక్రమాలతో బజ్ తగ్గకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 8 కోట్ల రూపాయల షేర్.. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.
సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని తొలిరోజు కలెక్షన్స్
శివాజీ మూవీ తొలిరోజు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమాకు ఫస్ట్ డే ఇండియాలో 20 లక్షల రూపాయల నెట్.. 23 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఓవర్సీస్‌లో సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీకి ప్రీమియర్స్ + డే 1 కలిపి 51,777 డాలర్లు (భారత కరెన్సీలో 48 లక్షల రూపాయలు) వసూలైనట్లు ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. దాంతో తొలిరోజు శివాజీ మూవీ వరల్డ్ వైడ్‌గా 70 లక్షల రూపాయల కలెక్షన్స్ సాధించింది.
సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని రెండో రోజు వసూళ్ల అంచనా
వీకెండ్ మీదే ఈ సినిమా యూనిట్ ఆశలు పెట్టుకుంది. అయితే శనివారం అయినప్పటికీ అంతంత మాత్రంగానే బుకింగ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అర్బన్, రూరల్ ఏరియాల్లోనూ ఈ సినిమాకు అంతగా స్సందన కనిపించడం లేదు. రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియా వైడ్‌గా 12 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి సాంప్రదాయిని సుప్పిని మూవీకి ఇండియాలో కేవలం 4 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ సినిమా రెండో రోజున వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











