Sampradayini Suppini Suddapoosani Day 3 Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. శివాజీ మూవీకి నష్టాలు తప్పాలంటే

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సీనియర్ నటుడు శివాజీ స్వయంగా నిర్మించిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని. ఈ మూవీలో శివాజీ సరసన లయ హీరోయిన్‌గా నటించారు. మార్చి 6వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

Also Read
Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్
Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్

ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు. రంజిన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా, రిత్విక్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

Sampradayini Suppini Suddapoosani Day 3 Expected Box Office Collections Worldwide Sivaji s film fail to get good number

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చు కలిపి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాకు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్‌‌లతో ముందు నుంచే సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ కార్యక్రమాలతో బజ్ తగ్గకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంది. శివాజీ మూవీకి తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల రేంజ్‌‌లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ లాభాల్లోకి రావాలంటే 4 కోట్ల రూపాయల షేర్.. 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.

Recommended For You
ఆమె జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే... దీప్తి సునైనాతో బ్రేకప్‌పై షణ్ముఖ్ ఎమోషనల్
ఆమె జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే... దీప్తి సునైనాతో బ్రేకప్‌పై షణ్ముఖ్ ఎమోషనల్

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని రెండు రోజుల కలెక్షన్స్
శివాజీ నటించిన ఈ మూవీ తొలిరోజున 20 లక్షల రూపాయలు, రెండో రోజున 23 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. రెండ్రోజుల వరకు ఇండియాలో 43 లక్షల రూపాయల నెట్.. 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 51,777 డాలర్లు (భారత కరెన్సీలో 48 లక్షల రూపాయలు) వసూలు చేసింది. దాంతో భారత్‌లో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయలు రాబట్టింది.

You May Also Like
'హీరోయిన్లు అణిగిమణిగి ఉండాల్సిందే.. ఇండస్ట్రీలో అలా తొక్కేస్తారు’
'హీరోయిన్లు అణిగిమణిగి ఉండాల్సిందే.. ఇండస్ట్రీలో అలా తొక్కేస్తారు’

సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని 3వ రోజు వసూళ్ల అంచనా
మిక్స్‌డ్ టాక్, మిక్సిడ్ రివ్యూలు తెచ్చుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ కలెక్షన్స్ పరంగా నిరాశపరుస్తోంది. వీకెండ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేసింది. అర్బన్, రూరల్ సెంటర్స్‌లోనూ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 3వ రోజు ఈ సినిమా 11 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్
ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీకి ఇండియాలో 3వ రోజు 6 లక్షల రూపాయల నికర వసూళ్లు మాత్రమే వచ్చాయి. మూడో రోజు శివాజీ మూవీ వరల్డ్ వైడ్‌గా 40 లక్షల రూపాయల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. దాంతో మూడు రోజుల వరకు సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీకి వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. శివాజీ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 3.5 కోట్ల రూపాయల షేర్... 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండగా ఈ టార్గెట్‌ను శివాజీ ఎలా బ్రేక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X