Samrat Prithviraj collections అక్షయ్ కుమార్‌కు మేజర్, విక్రమ్ దెబ్బ.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రానికి దేశవ్యాప్తంగా మేజర్, విక్రమ్ చిత్రాల నుంచి భారీ పోటీ ఎదురవుతున్నది. అయినా పోటీని తట్టుకొని ఈ చిత్రం గౌరవప్రదమైన వసూళ్లను తొలి రోజు నమోదు చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించగా.. సోనుసూద్, సంజయ్ దత్, అశుతోష్ రాణా, మనూషి చిల్లర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అయితే ఈ సినిమా మార్నింగ్ షో కేవలం 20 శాతం అక్యుపెన్సీతో మొదలైనప్పటికి మధ్నాహం షో నుంచి కలెక్షన్లు పుంజుకొన్నాయి. రూ.175 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
ఆస్ట్రేలియాలో సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రానికి మంచి రెస్సాన్స్ లభించింది. ఆస్ట్రేలియాలో మొదటి రోజున 37575 ఆస్ట్రేలియా డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో 97173 డాలర్లను వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 10.70 కోట్ల షేర్ సాధించింది. అయితే నాన్ హాలీవుడ్ రోజున అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. తొలి రోజున ఈ చిత్రం 33.71 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం.
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మేజర్ సినిమా వరల్డ్ వైడ్‌గా 13.10 కోట్ల గ్రాస్, 7.12 కోట్ల షేర్‌ను సొంతం చేసుకొన్నది. ఇలా మేజర్, విక్రమ్ సినిమాల నుంచి భారీ పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు రోజులు సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాకు కీలకంగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











