Michael Closing Collections: సందీప్ కిషన్ బిగ్ బడ్జెట్ మూవీ.. వచ్చింది ఎంత పోయింది ఎంత?
యువ హీరో సందీప్ కిషన్ ఎంతో కాలంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు కానీ అతనికి సరైన విజయం దక్కట్లేదు. ఇక ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఎంతో కసిగా చేసిన సినిమా మైఖేల్. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ అలాగే హిందీలో కూడా విడుదల చేశారు. ముఖ్యంగా తమిళ్ తెలుగులో భారీ స్థాయిలో ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. ఇక మైకేల్ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

స్టార్ క్యాస్ట్ తో వచ్చిన మైకేల్
సందీప్ కిషన్ నటించిన మైకేల్ సినిమాను నారాయణదాసు సమర్పణలో వెంకటేశ్వర సినిమా సెల్ల్పి కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్బీ బ్యానర్ల మీద పుష్కర రామ్మోహన్ రావు, భరత్ చౌదరి నిర్మించారు. రంజిత్ జైకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్య వంటి వారు కీలక పాత్రలో నటించారు.

బిజినెస్, టార్గెట్
ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లోనూ డిజాస్టర్ ఫలితాలు అందుకుని నష్టాలను మిగిల్చింది. సినిమాకి బడ్జెట్ ఎక్కువే అయినా ఈ సినిమాను తక్కువ రేట్లకు థియేటర్ బిజినెస్ చేశారు. కనీసం సినిమా 10 కోట్ల రేంజ్ లో కూడా బిజినెస్ చేయలేకపోయింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 7 కోట్లకు ఫిక్స్ అయినట్లు టాక్.

రెండవ వారమే డౌన్
ఇక మొదటి రోజే సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు. కానీ రొటీన్ స్టోరీ కావడంతో ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. రివ్యూలు కూడా చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. వారం మొత్తం మీద 4.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా రెండో వారం థియేటర్స్ తగ్గిపోవడంతో 70 లక్షల షేర్ మాత్రమే అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా..
ఇక ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్ల షేర్ 5.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4.90 కోట్ల షేర్ 10.10 కోట్ల లక్షల గ్రాస్ వసూలు చేసింది. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో జరిగే సినిమాని తక్కువ రేట్లకు అమ్మిన పూర్తిస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎంత నష్టం అంటే..
కేవలం 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా దిగగా సినిమా కంప్లీట్ అయ్యేసరికి 2.10 కోట్ల మేరా నష్టపోయి బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్నట్టు అయింది. అయితే సినిమా మీద ఉన్న నమ్మకంతో ముందుగా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అప్పట్లో దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసిన తర్వాత నిజంగానే దానికి సీక్యూల్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయినా పెద్దగా సినిమా గురించి మాత్రం బజ్ లేదు.


Click it and Unblock the Notifications











