Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
A1 Express 4 Days collections: సగం వరకు లాక్కొచ్చిన సందీప్ కిషన్.. మరికొంత స్పీడ్ పెంచాల్సిందే!
టాలెంటెడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ఫస్ట్ నుంచి కూడా రిజల్ట్స్ తో సంబందం లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కకుండా తమిళ్ కూడా అప్పుడప్పుడు కొన్ని హిట్స్ అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు పూర్తిగా తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ తో A1 ఎక్స్ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో పెట్టిన పెట్టుబడిలో సగం వరకు రాబట్టగలిగింది.
అదే నమ్మకంతో సక్సెస్ కొట్టాలని..
కరోనా లాక్ డౌన్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి టాలీవుడ్ మూవీస్ కు ఆదరణ గట్టిగానే అందుతోంది. నాంది లాంటి ప్రయోగాత్మకమైన సినిమా కూడా జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ కూడా అదే నమ్మకంతో సక్సెస్ కొట్టాలని 'నాట్పే తునై' అనే తమిళ సినిమా రీమేక్ తో వచ్చాడు.
కాన్ఫిడెంట్ గా ఉన్న సందీప్
సందీప్ కిషన్ బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది. ఇక A1 ఎక్స్ ప్రెస్ సినిమాపై అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హాకీ గేమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు అయితే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ ఆశతో ఉంది. ఇక రివ్యూలు కూడా పరవాలేదు అనే విధంగానే వచ్చాయి.
4వ రోజు వచ్చిన కలెక్షన్స్
A1 ఎక్స్ ప్రెస్ 4వ రోజు అందుకున్న కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
నైజాం 11లక్షలు, సీడెడ్ 4లక్షలు, ఉత్తరాంధ్ర 7లక్షలు, ఈస్ట్ 5లక్షలు, వెస్ట్ 4లక్షలు, గుంటూరు 5.1లక్షలు, కృష్ణా 5లక్షలు, నెల్లూరు 3లక్షలు. ఏపీ తెలంగాణలో 4వ రోజు ఈ సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ 0.44కోట్లు. గ్రాస్ 0.75కోట్లు.
లాభాల్లోకి రావాలి అంటే..
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.6కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5కోట్లు మాత్రమే. సందీప్ గత సినిమాలతో పోలిస్తే ఈ టార్గెట్ కాస్త పెద్దదే. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 4రోజుల్లో మొత్తం 2.58కోట్లు షేర్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ 4.49కోట్లు. ఈ విధంగా చూసుకుంటే ఇంకా సినిమా ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే 2.29కోట్లు రాబట్టాలి. మరి ఈ వారం ఎండ్ అయ్యే లోపు సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.