Prabhas: స్పిరిట్ దర్శకుడికి షాకింగ్ రెమ్యునరేషన్.. కెరీర్ లోనే మొదటిసారి అత్యధికంగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. మేకింగ్ పరంగా ఆకట్టుకోగలిగితే నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎంత ఖర్చయినా పర్వాలేదు అంటూ వారి ఆలోచనకు తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక గత కొంత కాలంగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా మంచి ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో అతని స్థాయి పెరిగిపోయింది.

ఇక కరెక్ట్ సమయంలోనే ప్రభాస్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ప్రభాస్ అతనితో తన 25వ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

మొదట ఆ హీరోతో అనుకొని..

మొదట ఆ హీరోతో అనుకొని..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత మళ్లీ తెలుగులోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కొంతమంది స్టార్ హీరోలకు కూడా మంచి కథలను చెప్పడం జరిగింది. అందులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. సూపర్ స్టార్ కోసం సందీప్ చాలా సార్లు రెండు కథల పై చర్చలు కూడా జరిపాడు. ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తోపాటు మంచి యాక్షన్ సినిమాకు సంబంధించిన కథను కూడా వివరించాడు. కానీ మహేష్ బాబు అంతగా కనెక్ట్ కాకపోవడంటగో సందీప్ రెడ్డి మళ్లీ వెనక్కి తగ్గి పోయాడు.

బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్

బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్

ఇక మహేష్ బాబుతో సినిమా చర్చల దశలో ఉండగానే సందీప్ రెడ్డికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డిని మ్ రీమేక్ చేయాలి ఒరిజినల్ దర్శకుడిని మాత్రమే బెస్ట్ అని అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడంతో ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ అమాంతంగా పెరిగిపోయింది.

ప్రభాస్ 25వ సినిమా..

ప్రభాస్ 25వ సినిమా..

రణ్ బీర్ కపూర్ తో కూడా ప్రస్తుతం సందీప్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో కూడా సినిమా చేయాలని ముందు నుంచి ప్రణాళికలు రచిస్తున్న సందీప్ రెడ్డికి సరైన సమయంలో కాల్ వచ్చింది. 25వ సినిమా అంతకుమించి ఉండాలి అని ప్రభాస్ ఆలోచించి యు.వి.క్రియేషన్స్ టీ సీరీస్ తో కలిపి సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక దర్శకుడు ఎవరు అనే విషయం లో ప్రభాస్ సందీప్ రెడ్డి చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

Recommended Video

Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
 సందీప్ రెడ్డి వంగా రెమ్యునరేషన్ ఎంతంటే..?

సందీప్ రెడ్డి వంగా రెమ్యునరేషన్ ఎంతంటే..?

ప్రభాస్ 25వ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా 150 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం రెమ్యునరేషన్ పరంగా కాకుండా లాభాల్లో వాటా ఇచ్చే విధంగా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చూసుకుంటే లాభాలు ఎంత ఎక్కువ వస్తే అందులో అంత ఎక్కువ శాతం సందీప్ ఖాతాలో చేరుతుంది. ఆ విధంగా చూసుకుంటే 50 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X