Mad Square Day 1 Collections : మ్యాడ్ స్క్వేర్ డే1 కలెక్షన్లు.. దున్నేశారుగా.. ఎన్ని కోట్లంటే?

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'మ్యాడ్ స్క్వేర్'. మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. 2023 అక్టోబర్ 6న విడుదలై విజయవంతమైన 'మ్యాడ్' చిత్రానికి సీక్వెల్ ఇది. కామెడీ, లవ్, యూత్ ను ఆకట్టుకునే అంశాలతో 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. టాక్ బాగుండటంతో ఇక బాక్సాఫీస్ కలెక్లన్లపై ఆసక్తి నెలకొంది.

మ్యాడ్ స్క్వేర్.. చిత్రానికి బాక్సాఫీస్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఇక సాక్ నిల్క్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. డే1 రూ.7.75 కోట్ల నెట్ ను వసూల్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఇండియాలోని కలెక్షన్లే. ఇక ఓవర్సీస్ లో ఎంత వసూల్ చేసిందనే తెలియాల్సి ఉంది. మరోవైపు డే1న మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17 కోట్ల గ్రాస్ వసూళ్లు అందాయని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఓవైపు భారీ చిత్రాలు రిలీజ్ ఉన్నా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి.

Sangeeth Shobhan Mad Square Day 1 Box Office Collections Worldwide

గతంలో వచ్చిన 'మ్యాడ్' చిత్రం రూ.8 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లను రాబ్టగలిగింది. అంటే 'మ్యాడ్ స్క్వేర్' తొలిరోజే రూ.17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం బాక్సాఫీస్ వద్ద మచి పరిణామంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ 'L2 : ఎంపురాన్', నితిన్ రాబిన్ హుడ్, విక్రమ్ వీర ధీర శూర.. చిత్రాలు థియేటర్లలో పార్లల్ గా రన్ అవుతున్నాయి. వీటితో పోటి పడి మరి 'మ్యాడ్ స్క్వేర్' వసూళ్లు రాబడుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.21 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. దీంతో రూ.22 కోట్ల రేంజ్ లోపు ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫిక్స్ చేశారు. డే1 కలెక్షన్ల జోరు చూస్తుంటే మొదటి వారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూత్ ను కడుపుబ్బా నవ్వించే కంటెంట్, లవ్, ఫ్రెండ్ షిప్ కు సంబంధించిన అంశాలను తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. డే1న 55 శాతం ఆక్యుపెన్సీ ని కూడా దక్కించుకుంది.

తొలిరోజు పాజిటివ్ బజ్ ను దక్కించుకున్న ఈ చిత్రం మున్ముందు థియేట్రికల్ రన్ ను ఎలా కొనసాగిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద కూడా ఎలా పెర్ఫామ్ చేస్తున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాడ్ స్క్వేర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో విడుదలైంది. వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించగా హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X