Mad Square Day 2 Collections : మ్యాడ్ స్క్వేర్ డే2 కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద కుర్రాళ్ల జోరు.. ఎన్నికోట్లంటే

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. 2023 అక్టోబర్ 6న విడుదలైన 'మ్యాడ్' చిత్రానికి ఇది సీక్వెల్. కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ వైపే యూత్, మిగితా ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారు. కాగా ఈ చిత్రం లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు వసూళ్లు చేయబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ మూవీ డే2 బాక్సాఫీస్ వసూళ్లు ఇలా ఉన్నాయి.

తొలుత బాక్సాఫీస్ వద్ద డే1న కలెక్ట్ చేసిన వసూళ్లు వివరాలు పరిశీలిస్తే.. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈచిత్రానికి 17 కోట్ల గ్రాస్ వసూల్ అవ్వడం విశేషం. ఇక ఇండియాలో మాత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే2న కూడా అదే రేంజ్ లో వసూళ్లు అందుకుంది. ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ లో శనివారం కావడంతో మరింత జోరుగా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.8.6 కోట్ల నెట్ అందుకుంది. దీంతో 2 రోజులకు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.17.1 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు అందుకుంది.

Sangeeth Shobhan Mad Square Day 2 Box Office Collections Worldwide

ఇక ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మ్యాట్రీ షోలకు ఆక్యుపెన్సీ కాస్తా తగ్గినా ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రం జోరుగానే ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంటోంది. డే2న ఓవరాల్ గా 51 శాతం ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.5.5 కోట్ల మేర షేర్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాల వారు తెలుపుతున్నారు. ఇక ఫస్ట్ వీకెండ్ లో మాత్రం ఈ చిత్రం ఎలాగైనా 50 కోట్ల మార్క్ ను దాటుందని మేకర్స్ భావిస్తున్నారు. సినిమాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న రెస్పాన్స్ ను చూసినా కూడా అదే అర్థమవుతుంది.

మరోవైపు బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి మంచి కలెక్షన్లే అందుతున్నాయి. ఇక గతంలో వచ్చిన 'మ్యాడ్' చిత్రం రూ.8 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లను రాబ్టగలిగింది. దీంతో 'మ్యాడ్ స్క్వేర్' లాంగ్ రన్ లో ఎంత వసూల్ చేస్తుందనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం థియేటర్లలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ 'L2 : ఎంపురాన్', నితిన్ రాబిన్ హుడ్, చియాన్ విక్రమ్ వీర ధీర శూర.. వంటి చిత్రాలు పార్లల్ గా రన్ అవుతున్నాయి. వీటితో పోటి పడి మరి 'మ్యాడ్ స్క్వేర్' వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.

ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.21 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.22 కోట్ల రేంజ్ లో వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కానుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించగా హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X