కలెక్షన్ల వరద: బాక్సాఫీసుపై కొనసాగున్న ‘సంజు’ దండయాత్ర!

By Bojja Kumar

రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన 'సంజు' ఇండియన్ బాక్సాఫీసు వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు రాబడుతోంది. తొలి రెండు వారాల్లో ఈ బయోపిక్ వసూళ్లు ఇండియన్ మార్కెట్లో రూ. 300 కోట్లకు చేరువైంది. ఈ చిత్రం లైఫ్‌టైమ్ రన్‌లో బజరంగీ భాయిజాన్, పద్మావత్, సుల్తాన్ కలెక్షన్ రికార్డులను తుడిపెట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Recommended Video

Sanju Movie Collections Crossed Bahubali Record
 రెండో వారం ఎంత?

రెండో వారం ఎంత?

తొలి వారం రూ. 202.51 కోట్లు వసూలవ్వగా... రెండో వారంలో రూ. 91.22 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియా మార్కెట్లో తొలి 14 రోజుల్లో నెట్ టోటల్ రూ. 293.73 కోట్లకు చేరుకుంది. టోటల్ గ్రాస్ రూ. 376.58 వసూలైనట్లు సమాచారం.

ఆ సినిమాల కంటే చాలా బెటర్

ఆ సినిమాల కంటే చాలా బెటర్

రెండో వారంలో వసూళ్లు పరిశీలిస్తే... శుక్రవారం రూ. 12.90 కోట్లు, శనివారం రూ. 22.02 కోట్లు, ఆదివారం రూ. 28.05, సోమవారం రూ. 9 కోట్లు, మంగళవారం రూ. 7.50 కోట్లు, బుధవారం రూ. 6.25 కోట్లు, గురువారం రూ. 5.50 కోట్లు వసూలైంది. 2018లో విడుదలైన పలు పెద్ద సినిమాలతో పోలిస్తే రెండో వారం ‘సంజు' వసూళ్లు చాలా బెటర్‌గా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

సూర్మ ఎఫెక్ట్

సూర్మ ఎఫెక్ట్

అయితే ఈ రోజు విడుదలైన ‘సూర్మ' వల్ల మూడో వారం ‘సంజు' కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. ఈ సినిమా దాదాపు 1100 థియేటర్లను ఆక్రమించింది. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలుండటమే ఇందుకు కారణం.

బాలీవుడ్ టాప్ రికార్డ్స్

బాలీవుడ్ టాప్ రికార్డ్స్

బాలీవుడ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ (ఓన్లీ హిందీ వెర్షన్, ఇండియన్ మార్కెట్) సాధించిన సినిమాల వివరాల్లోకి వెళితే.... మొదటి స్థానంలో బాహుబలి2(రూ. 510.99 కోట్లు), దంగల్ (రూ. 387.38 కోట్లు), (పికె రూ. 340 కోట్లు), టైగర్ జిందాహై (రూ. 339.16 కోట్లు), బజరంగీ బాయిజాన్ ( రూ. 320 కోట్లు), పద్మావత్ (రూ. 302 కోట్లు), సుల్తాన్ (రూ. 300 కోట్లు) మొదలగు చిత్రాలు.... సంజు(రూ. 293 కోట్ల) కంటే ముందున్నాయి. లైఫ్‌లో ‘సంజు' ఎంత వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X