‘సంజు’ కలెక్షన్ల సునామీ: 3రోజుల్లో రూ .120 కోట్లు... అక్కడ బాహుబలి2, దంగల్ స్మాష్!
Recommended Video

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సంజు' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ బయోపిక్ 3 రోజుల్లోనే రూ 120 కోట్ల మార్కును అధిగమించడంతో పాటు సల్మాన్ ఖాన్ రేస్-3ని బీట్ చేసింది.
సంజయ్ దత్ జీవితంగా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇండియన్ బాక్సాఫీసువద్ద తొలి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ... పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజైన శనివారం మరింత పుంజుకుని రూ. 38.60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం వసూళ్లు రూ. 46.71 కోట్ల రావడంతో టోటల్ కలెక్షన్ రూ. 120 కోట్లను అందుకుంది.
‘సంజు’ బాక్సాఫీస్ సంచలనం
‘సంజు' బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ అదరగొట్టిందంటూ.... ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆదివారం మైండ్ బ్లోయింగ్ కలెక్షన్..... ఓవరాల్ కలెక్షన్ రూ. 120 కోట్ల మార్కును అందుకుంది అని ట్వీట్ చేశారు.
2018 టాప్ ఓపెనింగ్ వీకెండ్ బిజినెస్
2018లో భారీ ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ సినిమాల లిస్టును తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. ఇందులో రూ. 120 కోట్లతో ‘సంజు' మొదటి స్థానంలో ఉంది.

రేస్-3 మూవీని బీట్ చేసిన ‘సంజు‘
సల్మాన్ ఖాన్ ‘రేస్-3' విడుదలైన తొలి 3 రోజుల్లోనే రూ. 106 కోట్లు రాబట్టింది. ‘సంజు' చిత్రానికి ఆదివారం కలెక్షన్లతో కలిపితే మొత్తం రూ. 120 కోట్లు వసూలైంది. రేస్-3 మూవీ యావరేజ్ టాక్‌తో తొలివారమే డీలా పడగా.... ‘సంజు' చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ‘సంజు' ఫుల్ రన్‌లో రేస్-3 పాటు పలు బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాలో వసూళ్లు అదుర్స్
ఓవర్సీస్ మార్కెట్లో యూఎస్ఏ తర్వాత ఆస్ట్రేలియా ఎంత కీలకం. ఇక్కడ ‘సంజు' మూవీ ఫస్ట్ వీకెండ్ $ 931,947 వసూలు చేసింది. సోమవారం లేదా మంగళవారం నాటికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ మార్కను అందుకునే అవకాశం ఉంది.
అక్కడ దంగల్, బాహుబలి2 రికార్డులు స్మాష్
ఆస్ట్రేలియాలో ‘సంజు' మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో రేస్ 2, బాహుబలి 2, దంగల్ రికార్డులను బద్దలు కొట్టింది. సంజు $ 931,947 వసూలు చేయగా, దంగల్ $ 735,755, బాహుబలి 2(హిందీ) $ 839,323 మాత్రమే రాబట్టింది.


Click it and Unblock the Notifications











