twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సంజు’ బాక్సాఫీస్ రిపోర్ట్: నెల రోజుల్లో ఎంత వసూలైందంటే...?

    By Bojja Kumar
    |

    సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సంజు' బయోపిక్ తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సృష్టించబోతోందని, ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని అంతా అంచనా వేశారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నెల రోజులు పూర్తయినా రూ. 600 కోట్ల మార్కును అందుకోలేదు. ఇండియన్ మార్కెట్లో ఈ చిత్రం టాప్ 5లో ఉన్నప్పటికీ.... ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ కలెక్షన్స్ పరంగా వెనకబడి ఉంది.

    నెల రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

    నెల రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

    ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆశాజనకమైన వసూళ్లు రాబడుతోంది. ఐదో వారం ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 2.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇక 31 రోజుల్లో వసూలైన మొత్తం షేర్ రూ. 339.75 కోట్లకు చేరుకుంది. టోటల్ ఇండియన్ మార్కెట్ గ్రాస్ రూ. 435 కోట్లుగా నమోదైంది. దీంతో టైగర్ జిందాహై లైఫ్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టినట్లయింది.

    త్వరలో ‘పికె' రికార్డ్ బద్దలు

    త్వరలో ‘పికె' రికార్డ్ బద్దలు

    ఇండియన్ బాక్సాఫీసు వద్ద హయ్యెస్ట్ షేర్ వసూలు చేసిన చిత్రాల్లో మొదటి స్థానంలో బాహుబలి-2 (రూ. 510.99 కోట్లు), దంగల్ (రూ. 387.38 కోట్లు), పికె (340.8 కోట్లు)తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సంజు వసూళ్లు రూ. 339.75 కోట్లుగా ఉంది. మరో కోటి వసూలైతే ‘పికె' స్థానాన్ని ‘సంజు' ఆక్రమించబోతోంది. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కావడం విశేషం.

    ఓవర్సీస్‌ కలెక్షన్స్

    ఓవర్సీస్‌ కలెక్షన్స్

    ఓవర్సీస్ మార్కెట్లో ‘సంజు' మూవీ 5వ వారం రూ. 1.25 కోట్ల గ్రాస్ వసూలైంది. 31 రోజుల్లో టోటల్ ఓవర్సీస్ గ్రాస్ రూ. 148.20 కోట్లు వసూలైంది. త్వరలోనే ఇది రూ. 150 కోట్ల మార్కును అందుకోనుంది.

    వరల్డ్‌వైడ్ కలెక్షన్లలో టాప్ ఇవే...

    వరల్డ్‌వైడ్ కలెక్షన్లలో టాప్ ఇవే...

    వరల్డ్ వైడ్ కలెక్షన్ల పరంగా టాప్ 10 ఇండియన్ సినిమాల విషయానికొస్తే... దంగల్ (రూ. 2 వేల కోట్లకుపైగా) మొదటి స్థానంలో ఉండగా, బాహుబలి 2 (రూ. 1790 కోట్ల)తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బజరంగీ భాయిజాన్ (రూ. 900.90 కోట్లు), సీక్రెట్ సూపర్ స్టార్ (రూ. 900 కోట్లు), పికె (రూ. 792 కోట్లు), బాహుబలి 1 (రూ. 650 కోట్లు), పద్మావత్ (రూ. 585 కోట్లు), సుల్తాన్ (రూ. 584.40 కోట్లు), సంజు( రూ. 584.01 కోట్లు), టైగర్ జిందాహై (రూ. రూ. 545.83 కోట్లు) ఉన్నాయి.

    English summary
    Film trade analyst Taran Adarsh tweeted, "#Sanju crosses *lifetime biz* of #TigerZindaHai... Now FOURTH HIGHEST GROSSING *Hindi* film... Chasing #PK *lifetime biz* now... [Week 5] Fri 45 lakhs, Sat 87 lakhs, Sun 1.15 cr. Total: ₹ 339.75 cr. India biz. ALL TIME BLOCKBUSTER."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X