twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజు కలెక్షన్ల సునామీ.. అమీర్ ‘పీకే’, సల్మాన్ ‘టైగర్’ రికార్డు బ్రేక్.. దంగల్‌‌కు ముప్పు!

    By Rajababu
    |

    Recommended Video

    Sanju Movie Joins In Rs 300-Crore Club

    బాలీవుడ్‌లో వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. జూన్ 29న రిలీజై రికార్డు కలెక్షన్లతో ఈ చిత్రం దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం 341.22 కోట్ల వసూళ్లను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఇటీవల రిలీజైన భారీ చిత్రాలకు పోటీగా ఉండటం ట్రేడ్ వర్గాను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

    సంజు రికార్డుల హోరు

    సంజు రికార్డుల హోరు

    సంజూ బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బ్రేక్ చేస్తున్నది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై చిత్ర కలెక్షన్లను అధిగమించింది. నాన్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ చిత్రం ఈ రేంజ్‌లో వసూలు చేయడం బాలీవుడ్‌లో ఇదే తొలిసారి.

    బాలీవుడ్‌లో మూడో చిత్రంగా

    బాలీవుడ్‌లో మూడో చిత్రంగా

    అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం వసూళ్ల రికార్డును సంజూ అధిగమించింది. హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన మూడో చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఐదోవారంలో శుక్రవారం 45 లక్షలు, శనివారం 87 లక్షలు, ఆదివారం 1.15 కోట్లు, సోమవారం 35 లక్షలు, మంగళవారం 40 లక్షలు, బుధవారం 38 లక్షలు, గురవారం 34 లక్షల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    పీకే రికార్డు బ్రేక్

    పీకే రికార్డు బ్రేక్

    బాలీవుడ్‌లో బాహుబలి ది కన్‌క్లూజన్ రూ.510 కోట్లతో మొదటి స్థానంలో, దంగల్ రూ.387.38 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. అంతకు ముందు పీకే సినిమా సాధించిన అధిగమించి రూ.341.22 కోట్లతో సంజు మూడో స్థానంలో చేరింది.

    బాలీవుడ్ సినిమాలకు గట్టిపోటి

    బాలీవుడ్ సినిమాలకు గట్టిపోటి

    ఆగస్టు 3న రిలీజైన ఫన్నేఖాన్, ముల్క్, కార్వాన్ చిత్రాల కలెక్షన్లు అత్యంత నిరాశజనకంగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాలతోపాటు ఇటీవల రిలీజైన బాలీవుడ్ సినిమాలకు సంజూ గట్టిపోటీ ఇస్తున్నది. ఇదే ఊపు కొనసాగితే దంగల్ 387.38 కోట్ల వసూళ్లను అధిగమించి రెండో స్థానంలో చేరే అవకాశం లేకపోలేదు.

    English summary
    Rajkumar Hirani’s Sanju has now crossed Rs 250 crore-mark at the box office within 10 days of the release. According to a boxofficeindia report, the Ranbir Kapoor-starrer has earned Rs 261.83 crore and is expected to Rs 300-crore club. The Ranbir Kapoor film is still going strong at the box office and has broken as many records as it has created. Recenly Sanju smashes records and beats PK at box office after Tiger Zinda Hai. After beating Salman Khan's Tiger Zinda Hai box office collection, the Sanjay Dutt biopic has whooshed past Aamir Khan's PK collection as well, and now stands at Rs 341.22 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X