‘సంజు’ ఫస్ట్ డే కలెక్షన్: సంజయ్ దత్ బయోపిక్‌కు ఊహించని రెస్పాన్స్!
Recommended Video

బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులంతా దాదాపు సంవత్సరకాలంగా వెయిట్ చేసిన సంజయ్ దత్ బయోపక్ 'సంజు' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్సే వచ్చింది. అటు క్రిటిక్స్ నుండి, ఇటు కామన్ ఆడియన్స్ నుండి సినిమా మైండ్ బ్లోయింగ్ అనే కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఫుల్ రన్‌లో రణబీర్ కపూర్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమా నిలవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
రణబీర్ కపూర్‌కు గడిచిన ఐదేళ్లలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ 'యే జవానీ హై దివానీ'... 2013లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రూ. 188 కోట్లు వసూలు చేసింది. మరి రణబీర్ కపూర్ కెరీర్లో 'సంజు' మరో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలవబోతోందా? అనేది త్వరలోనే తేలనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
తొలి రోజు కలెక్షన్ ఎంత?
ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో రూ. 34.75 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. రణబీర్ కపూర్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ.

రణబీర్ కపూర్ కెరీర్లో సంజు టర్నింగ్ పాయింట్
రణబీర్ కపూర్ కెరీర్ పరిశీలిస్తే చాలా కాలంగా అతడికి సరైన హిట్స్ లేవు. ‘సంజు' మూవీ రణబీర్ కు తప్పకుండా కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటన అందరినీ కట్టిపడేసింది.

వరల్డ్ వైడ్ బిజినెస్
ఒక్క ఇండియాలోనే తొలి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్ వివరాలు రావాల్సి ఉంది. అన్నీ కలిపితే రూ. 40 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా.
2018లో ఇదే బిగ్గెస్ట్?
2018లో ‘సంజు' మూవీ బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవనుందని అంటున్నారు. ఫస్ట్ డే కెలక్షన్ పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఎంత వసూలైంది? అనే విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











